టీడీపీ కేంద్ర కార్యాలయానికి చేరుకున్న బుద్ధా, బొండా: కారును పరిశీలించిన చంద్రబాబు

By Siva KodatiFirst Published Mar 11, 2020, 4:57 PM IST
Highlights

మాచర్లలో వైసీపీ కార్యకర్తల చేతిలో దాడికి గురైన టీడీపీ నేతలు మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా దాడికి గురైన కారును టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పరిశీలించారు

మాచర్లలో వైసీపీ కార్యకర్తల చేతిలో దాడికి గురైన టీడీపీ నేతలు మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా దాడికి గురైన కారును టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పరిశీలించారు. దాడి జరిగిన తీరును బొండా ఉమ, బుద్ధా వెంకన్నలు చంద్రబాబుకు తెలిపారు.

ఏ సందర్భంలో దాడి జరిగింది... దాని నుంచి తాము ఏ విధంగా బయటపడ్డామో ఉమా, బుద్దా వెల్లడించారు. డీఎస్పీ వాహనం ఎస్కార్టుగా రాకపోయుంటే తాము ప్రాణాపాయానికి గురయ్యేవారమని, పోలీసు వాహనం కూడా దాడిలో ధ్వంసమైందన్నారు.

Also Read:మాచర్ల దాడి: నారా లోకేష్ కి ఫేక్ ట్వీట్ తిప్పలు..

తెలుగుదేశం పార్టీ నేతలకు రక్షణ కల్పించడంలో పోలీసులు విఫలమయ్యారని, దీనిని వ్యూహాత్మకంగా జరిగిన దాడికి పార్టీ నేతలు అనుమానిస్తున్నారు. ఘటనా ప్రాంతం నుంచి తాము వెళ్లిపోతున్నప్పటికీ వైసీపీ కార్యకర్తలు మోటారు వాహనాలపై వెంబడించి మరీ దాడి చేశారని బొండా ఉమా, బుద్ధా వెంకన్న అధినేత దృష్టికి తీసుకొచ్చారు.

తమ పార్టీ నేతలపై జరిగిన దాడిని ఇప్పటికే చంద్రబాబు డీజీపీకి లేఖ ద్వారా తీసుకెళ్లారు. అలాగే ఎన్నికల సంఘం కమీషనర్‌కు కూడా ఆయన లేఖ రాశారు. రాష్ట్రంలో ప్రశాంతంగా ఎన్నికలు జరిగే పరిస్ధితి లేదని భద్రత కల్పించడంలో పోలీసులు పూర్తిగా విఫలమయ్యారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.

Also Read:మాచర్ల దాడి: బోండా ఉమా కారు ఢీకొట్టింది ఇతన్నే... వీడియో వైరల్

పల్నాడుతో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కూడా టీడీపీ నేతలను నామినేషన్లు వేయకుండా వైసీపీ శ్రేణులు అడ్డుకుంటున్నాయని చంద్రబాబు ఫిర్యాదు చేశారు. నో డ్యూస్ సర్టిఫికేట్లు ఇవ్వకుండా అధికారులు సైతం తమ పార్టీ నేతలను ఇబ్బంది పెడుతున్నారని చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు. 

click me!