మక్కెలిరగదీస్తాం: పవన్ కళ్యాణ్ కు రెండు చెప్పులు చూపిన పేర్నినాని

Published : Jun 15, 2023, 11:44 AM ISTUpdated : Jun 15, 2023, 12:43 PM IST
 మక్కెలిరగదీస్తాం: పవన్ కళ్యాణ్ కు  రెండు  చెప్పులు  చూపిన పేర్నినాని

సారాంశం

పవన్ కళ్యాణ్ పై  వైసీపీ ఎమ్మెల్యే   పేర్ని నాని  తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ కు  రెండు చెప్పులు చూపించారు. 

తాడేపల్లి:పవన్ కళ్యాణ్  ఒక్క చెప్పు చూపిస్తే  తాను  రెండు  చెప్పులుచూపిస్తానని  మాజీ మంత్రి పేర్నినాని  చెప్పారు.  నీకొక్కడికేనా చెప్పులుంది. మాకు కూడా చెప్పులున్నాయని  మీడియా సమావేశంలో  తన  రెండు చెప్పులను  పేర్ని నాని  చూపారు.

గురువారంనాడు  తాడేపల్లిలోని  వైఎస్ఆర్‌సీపీ   కార్యాలయంలో  మాజీ మంత్రి  పేర్ని నాని  మీడియాతో మాట్లాడారు.  కత్తిపూడి సభలో  వైఎస్ఆర్‌సీపీపై  పవన్ కళ్యాణ్  చేసిన విమర్శలకు  పేర్ని నాని కౌంటర్ ఇచ్చారు. 

వైఎస్ఆర్‌సీపీ  నేతలకు  చెప్పు చూపించి మక్కెలిరగదీస్తానని  వార్నింగ్ ఇచ్చినట్టుగా  పవన్ కళ్యాణ్  చేసిన వ్యాఖ్యలపై   పేర్ని నాని తీవ్రంగా స్పందించారు. వపన్ కళ్యాణ్  ఒక చెప్పు చూపిస్తే  తాను  రెండు  చెప్పులు చూపిస్తానని పేర్ని నాని   మీడియా సమావేశంలో  రెండు  చెప్పులు  చూపించారు. 

పవన్ కళ్యాణ్ వారాహి యాత్రను  నారాహి యాత్రగా  ఆయన  పేర్కొన్నారు.  చంద్రబాబును  అధికారంలోకి తెచ్చేందుకు  పవన్ కళ్యాణ్  పనిచేస్తున్నారన్నారు.  రోజుకో డైలాగ్  చెప్పి  దాన్ని వ్యూహామంటారని  పవన్ తీరుపై  పేర్ని నాని మండిపడ్డారు. వ్యూహాల్ని నమ్ముకుంటే  అసెంబ్లీకి వెళ్లలేడన్నారు. ప్రజలను నమ్ముకుంటేనే  అసెంబ్లీలో అడుగుపెడతారని   పవన్ కళ్యాణ్ కు  పేర్ని నాని  హితవు పలికారు. 

జనసేనను  నడిపిస్తుంది  చంద్రబాబు అనే విషయాన్ని చిన్నపిల్లాడు  కూడ చెబుతాడన్నారు.టీడీపీ  కోసం  కొత్త డ్రామాలకు  పవన్ కళ్యాణ్ తెరతీశాడని ఆయన విమర్శించారు. బుస మాటలు ,సొల్లు మాటలు  తాను కూడ చెబుతానన్నారు. ఈ రకమైన మాటలు చెప్పడం నీకే వస్తుందా అని  పేర్నినాని  పవన్ కళ్యాణ్ ను ప్రశ్నించారు. ఏపీలో  జగన్ సీఎం అయ్యాక  పవన్ కళ్యాణ్ రెండు  సినిమాలు తీశారని  ఆయన గుర్తు చేశారు.

also read:హైద్రాబాద్ లో గులాబీ జెండా జేబులో పెట్టుకు తిరుగుతున్నాడు: పవన్ పై పేర్నినాని సెటైర్లు

 పవన్ కళ్యాణ్ ఎన్ని సినిమాలు తీస్తే  తాము ఎన్ని ఆపామని ఆయన  ప్రశ్నించారు. సినిమాలు బాగా తీయకపోతే ఎందుకు  ఆడుతాయని ఆయన  ప్రశ్నించారు. టీడీపీ  ప్రభుత్వ హయంలో    సినిమా టిక్కెట్లపై  పన్నులు వేయలేదా అని  ఆయన  ప్రశ్నించారు.  పవన్ కళ్యాణ్ కు చే అంటే  చంద్రబాబు గుర్తు వస్తారన్నారు.  సీఎం పదవి  ఏమైనా దానమా , ఎవరైనా ఇస్తే తీసుకోవడానికి  అని పేర్ని నాని  ప్రశ్నించారు. 


 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Vice President C.P. Radhakrishnan Offers Prayers at Tirumala Temple | TTD | Asianet News Telugu
AP Food Commission Chairman | ఎక్కడికి పోయినా ఇదే కంప్లైంట్.. ఇలా అయితే కష్టమే | Asianet News Telugu