యువకుడిని కొట్టి చంపిన గే.. డేటింగ్ యాప్ పరిచయం ప్రాణం తీసింది..

Published : Jun 15, 2023, 09:02 AM IST
యువకుడిని కొట్టి చంపిన గే.. డేటింగ్ యాప్ పరిచయం ప్రాణం తీసింది..

సారాంశం

గే డేటింగ్ యాప్ ఓ యువకుడి ప్రాణం తీసింది. ఇద్దరు యువకుల మధ్య చెలరేగిన వివాదం కారణంగా ఒకరు దారుణ హత్యకు గురయ్యారు. 

విజయవాడ : డేటింగ్ యాప్లతో జరుగుతున్న మోసాల కోవలోకి మరో దారుణం చేరింది. గే డేటింగ్ యాప్ లో పరిచయమైన ఇద్దరు యువకుల మధ్య జరిగిన గొడవలో ఓ యువకుడు దారుణ హత్యకు గురైన ఘటన విజయవాడలో చోటుచేసుకుంది. డేటింగ్ యాప్ పరిచయాలు చివరికి విషాదంతం అయ్యింది. గే డేటింగ్ యాప్ వ్యవహారం ప్రస్తుతం విజయవాడలో కలకలం రేపుతుంది. ఈ యాప్ లో పరిచయం అయిన ఇద్దరు యువకులు ఏకాంతంగా కలుసుకున్నారు.

వారిద్దరి మధ్య ఏం జరిగిందో తెలియదు కానీ ప్రసాద్ అనే యువకుడు దారుణ హత్యకురయ్యాడు. దీన్ని మొదట పోలీసులు అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్నారు. ప్రసాద్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిర్వహించగా షాకింగ్ విషయాలు వెలుగు చూసాయి. తీవ్రంగా కొట్టడం వల్లే ప్రసాద్ చనిపోయాడని ఆ రిపోర్టులో తేలింది. దీంతో పోలీసులు కేసును సీరియస్గా తీసుకుని,  లోతుగా విచారణ చేశారు. అసలు విషయం వెలుగు చూసింది.

రోడ్డు దాటుతుండగా వ్యాన్ ఢీ కొని మూడు ఏనుగులు మృతి..

ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలలోకి వెళితే..  గ్రిండర్ అనే యాప్ లో విజయవాడకు చెందిన ప్రసాద్ కు అవనిగడ్డకు చెందిన సాయితో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో వీరిద్దరూ చాటింగ్ చేసుకున్నారు. డేటింగ్ కి కలుసుకోవాలని గత నెల 18న విజయవాడలో కలుసుకున్నారు. కాసేపు ముచ్చట్లాడుకున్నారు. ఆ తర్వాత మద్యం తాగి.. కృష్ణా నదిలోకి ఏకాంతంగా గడపటానికి వెళ్లారు.

ఆ  తర్వాత కొద్దిసేపటికి మద్యం మత్తులో ఉన్న ప్రసాద్, సాయిల మధ్య వివాదం చోటు చేసుకుంది. ప్రసాద్ మీద సాయి కర్రతో దాడి చేశాడు. తీవ్రంగా గాయపరిచాడు. ఆ దాడి నుంచి తప్పించుకున్న ప్రసాద్ ఆటోలో ఇంటికి బయలుదేరి వెళ్ళాడు. ఆ తర్వాత కాసేపటికి మృతి చెందాడు. ప్రసాద మృతిని పోలీసులు అనుమానాస్పద మృతిగా విచారణ చేపట్టారు.

పోస్టుమార్టం రిపోర్టులో ప్రసాదను తీవ్రంగా కొట్టడం వల్లే మృతి చెందాడని తేలింది. దీంతో లోతుగా విచారించగా.. గే యాప్..డేటింగ్..  ప్రసాద్ మీద సాయి దాడి చేయడం వెలుగు చూసాయి. సాయి తీవ్రంగా కొట్టి, దాడి చేసి ప్రసాద్ ను హత్య చేశాడని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. సాయిని అదుపులోకి తీసుకున్నారు. సాయిని అదుపులోకి తీసుకుని, విచారించగా జరిగిన ఘోరం మొత్తం వెలుగు చూసింది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Jogi Ramesh vs Police: పారిపోతున్న జోగి రమేష్ వేటాడి పట్టుకున్న పోలీసులు| Asianet News Telugu
నువ్వు నీతులు చెప్పకు అక్క : Byreddy Siddarth Reddy Counter To Byreddy Shabari | Asianet Telugu