తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ కు చెందిన మాజీ మంత్రి కొడాలి నాని కౌంటరిచ్చారు.
విజయవాడ: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని పరామర్శించేందుకు ఆయనకు ఏమైనా తుంటి ఎముక విరిగిందా అని మాజీ మంత్రి, వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే కొడాలి నాని ప్రశ్నించారు.
సోమవారం నాడు రాత్రి తాడేపల్లిలో కొడాలి నాని మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు చెప్పారన్నారు. కానీ, తనకు జగన్మోహన్ రెడ్డి కనీసం ఫోన్ చేయలేదని రేవంత్ రెడ్డి ఓ తెలుగు న్యూస్ చానెల్ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు.ఈ వ్యాఖ్యలకు కొడాలి నాని కౌంటరిచ్చారు.
undefined
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు తుంటి ఎముక విరిగితే ఆయనను వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి పరామర్శించారన్నారు. రేవంత్ రెడ్డికి తుంటి ఎముక విరిగిందా అని ఆయన ప్రశ్నించారు.రేవంత్ రెడ్డి కాంగ్రెస్ తరపున ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారన్నారు. రేవంత్ రెడ్డిని సీఎం జగన్ ఎందుకు కలుస్తారని ఆయన ప్రశ్నించారు.తమకు రేవంత్ రెడ్డిని కలవాల్సిన అవసరం లేదన్నారు.రేవంత్ రెడ్డి ఏమైనా సుప్రీమా అని ఆయన ప్రశ్నించారు.
also read:పాదయాత్రలతో రికార్డ్: వైఎస్ఆర్‌సీపీ నుండి కాంగ్రెస్ వరకు షర్మిల ప్రస్థానమిదీ..
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిసేందుకు అపాయింట్ మెంట్ కోరినట్టుగా వచ్చిన వార్తలను కొడాలి నాని ఖండించారు. పక్క రాష్ట్రం సీఎంను కలసి తాను ఏం చేస్తానన్నారు. తమ సీఎంను కలిసేందుకే సమయం లేదన్నారు.
also read:నలుగురు ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎమ్మెల్సీలపై అనర్హత: ఫిర్యాదు చేసిన వైఎస్ఆర్‌సీపీ
వై.ఎస్. షర్మిలకు తన మద్దతుంటుందని రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కూడ ఆయన స్పందించారు. కాంగ్రెస్ పార్టీలో షర్మిల చేరినందున ఆమెకే మద్దతిస్తారన్నారు. సీఎం పదవికి రాజీనామా చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పీసీసీ అధ్యక్ష పదవిని రేవంత్ రెడ్డి చేపట్టినా తమకు అభ్యంతరం లేదన్నారు.చంద్రబాబును గెలిపించేందుకే షర్మిలను వినియోగించుకుంటున్నారని ఆయన ఆరోపించారు. చంద్రబాబు డబ్బులకు సీట్లు అమ్ముకుంటున్నారని కొడాలి నాని చెప్పారు. 150కోట్లు ఖర్చు పెట్టేందుకు ముందుకు రావడంతో విజయవాడ ఎంపీ సీటు కేసినేని చిన్నికి ఇస్తున్నారని నాని తెలిపారు.కారణాలు చెప్పి సీఎం జగన్ ఆయా నియోజకవర్గాల్లో అభ్యర్థులను మార్చుతున్నారని కొడాలి నాని చెప్పారు. . మాజీ మంత్రి పార్థసారధికి సీటు ఇవ్వనని చెప్పలేదన్నారు.