కన్నకొడుకునే కత్తిపీటతో.. గొంతుకోసి చంపిన తండ్రి... మద్యం మత్తులో దారుణం..

Published : Jun 09, 2022, 11:51 AM IST
కన్నకొడుకునే కత్తిపీటతో.. గొంతుకోసి చంపిన తండ్రి... మద్యం మత్తులో దారుణం..

సారాంశం

కర్నూలులో దారుణం జరిగింది. ఓ కన్నతండ్రి.. కొడుకు మీద కత్తిపీటతో దాడి చేసి దారుణంగా హతమార్చాడు. మద్యం మత్తులో దారుణానికి తెగబడ్డాడు. 

కర్నూల్ : మద్యం మత్తులో కన్న కొడుకునే murder చేశాడో కన్నతండ్రి. ఈ ఘటన ఆత్మకూరు పట్టణంలో బుధవారం చోటుచేసుకుంది. ఆత్మకూరులోని vengalareddy nagarలో పని చేసుకుని జీవించే తండ్రీకొడుకులు హసన్ పీరా (70), మౌలాలి (25)మద్యానికి బానిసలై తరచూ గొడవ పడేవారు. బుధవారం మధ్యాహ్నం మౌలాలి నిద్రిస్తుండగా liquor తాగి వచ్చిన తండ్రి హసన్ పీరా మౌలాలిపై కత్తి పీటతో attack చేశాడు. 

దీంతో గొంతు తెగి... తీవ్ర రక్తస్రావంతో కొట్టుమిట్టాడుతున్న మౌలాలిని స్థానికులు ఆత్మకూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో 108 ద్వారా మౌలాలిని కర్నూలుకు తీసుకువెడుతుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. సంఘటనా స్థలాన్ని ఆత్మకూరు డిఎస్పి శృతి, సీఐ సుబ్రహ్మణ్యం పరిశీలించి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు హసన్ పీరా పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. 

ఇలాంటి ఘటనే నిరుడు జూలైలో పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగింది. పశ్చిమగోదావరి జిల్లాలో భార్య మీద అనుమానంతో తొమ్మిది నెలల పసికందు గొంతులో చేపపిల్లను వేశాడో కసాయి తండ్రి. దీంతో ఊపిరి ఆడక ఆ బాలుడు చనిపోయాడు. ఈ ఘటన స్థానికంగా విషాదం నింపింది.  పశ్చిమగోదావరి జిల్లా, ఉండి మండలం చెరుకువాడలో కన్నకొడుకును చంపేశాడో తండ్రి. తొమ్మిది నెలల చిన్నారి గొంతులో చేపపిల్ల వేశాడో కసాయి. గొంతులో చేప ఇరుక్కోవడంతో ఊపిరి ఆడక బాలుడు చనిపోయాడు. ఈ ఘటన స్థానికంగా విషాదం నింపింది. 

తొమ్మిది నెలల చిన్నారి గొంతులో తండ్రి నారాయణ చేపపిల్ల ఎందుకు వేశాడన్నది మిస్టరీగా మారింది. అయితే బార్యమీద కోసంతోనే ఇలా చేశాడని స్తానికులు ఆరోపిస్తున్నారు. భార్య ఎవరితో మాట్లాడినా సంబంధాలు అంటగట్టేవాడని, నిత్యం అనుమానిస్తూ టార్చర్ పెట్టే వాడంటూ ఈ క్రమంలోనే అనుమానం పెనుభూతమై ఆ కోపాన్ని చిన్నారిమీద తీర్చుకున్నాడని మండిపడుతున్నారు.

స్థానికులు ఇంతగా ఆరోపణలు చేస్తున్నా.. నారాయణ మాత్రం తనకేం తెలియనట్టుగానే చూస్తూ ఉండిపోయాడు. బిడ్డను చంపిన పశ్చాత్తాపం ఏ మాత్రం అతనిలో కనిపించలేదు. అభం శుభం తెలియని చిన్నారి ఉసురుతీసిన నారాయణను కఠినంగా శిక్షించాలని చెరుకువాడ గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. తల్లి ఒడిలో ఆడుకుంటున్న తొమ్మిది నెలల బాలుడి గొంతులో గొరక చేపను వేశాడు తండ్రి నారాయణ. ఇది గమనించిన తల్లి వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్తుండగా దారిలోనే బాలుడు చనిపోయినట్లుగా డాక్టర్లు తెలిపారు.

భార్య సుధారాణి మీద భర్త నారాయణకు ఉన్న అనుమానమే కొడుకు మృతికి కారణంగా మారింది. కొడుకు నారాయణకంటే కొంచెం ఎరుపుగా పుట్టడంతో ఈ అనుమానం మరింత బలపడింది. చివరికి చిన్నారి ఉసురు తీసింది. అయితే చేపపిల్ల ఇంట్లోకి ఎలా వచ్చింది? ముందుగా చంపే ఉద్దేశ్యంతోనే నారాయణ తీసుకువచ్చాడా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో చలి తుపాను బీభత్సం.. ఆల్ టైమ్ రికార్డ్ టెంపరేచర్స్ తో ఇక్కడ అల్లకల్లోలమే
Cold Wave Alert : ఈ మూడ్రోజులు తస్మాత్ జాగ్రత్త.. ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం..!