బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలకు మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ దూరంగా ఉండనున్నారు. ఈ సమావేశాలకు కన్నా దూరం కావడం ప్రస్తుతం చర్చకు దారి తీసింది.
అమరావతి:బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలకు ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ దూరంగా ఉండనున్నారు. మంగళవారంనాడు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు జరగనున్నాయి. ఈ రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనేందుకు బీజేపీ నేతలు ఇప్పటికే భీమవరం చేరుకున్నారు. కానీ కన్నా లక్ష్మీనారాయణ తెలంగాణలోని హైద్రాబాద్ లో ఉన్నారు. వ్యక్తిగత పనుల నిమిత్తం ఆయన హైద్రాబాద్ కు వచ్చినట్టుగా కన్నా లక్ష్మీనారాయణ వర్గీయులు చెబుతున్నారు.
also read:ఏపీ బీజేపీలో కలకలం: కన్నా లక్ష్మీనారాయణపై అధిష్టానానికి సోము ఫిర్యాదు
undefined
ఇటీవల న్యూఢిల్లీలో జరిగిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు కూడా కన్నా లక్ష్మీనారాయణ దూరంగా ఉన్నారు. ఈ సమావేశాలకు కన్నా లక్ష్మీనారాయణ వర్గానికి ఆహ్వనం పంపవద్దని ప్రత్యర్ధి వర్గం ఒత్తిడి తెచ్చిందనే ప్రచారం కూడ సాగింది. ఈ సమావేశాలకు కన్నా లక్ష్మీనారాయణకు బీజేపీ నాయతక్వం ఆహ్వానం పంపింది. జాతీయ కార్యవర్గ సమావేశాలకు కూడా కన్నా లక్ష్మీనారాయణ దూరంగా ఉన్నారు. ఇవాళ నిర్వహించే రాష్ట్ర కార్యవర్గ సమావేశాలకు కూడా ఆయన హాజరు కాలేదు.
గత ఏడాది చివర్లో జనసేన పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ చైర్మెన్ నాదెండ్ల మనోహర్ కన్నా లక్ష్మీనారాయణతో భేటీ అయ్యారు. జనసేనలో కన్నా లక్ష్మీనారాయణ చేరుతారని ప్రచారం సాగుతుంది. ఈ ప్రచారాన్ని కన్నా లక్ష్మీనారాయణ వర్గీయులు ఖండిస్తున్నారు. బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న సమయంలో నియమించిన ఆరు జిల్లాల అధ్యక్షులను సోము వీర్రాజు ఇటీవల తొలగించారు. తొలగించిన ఆరు జిల్లాల అధ్యక్షులను రాష్ట్ర కార్యవర్గంలోకి తీసుకున్నట్టుగా సోము వీర్రాజు వర్గం చెబుతుంది.
రాష్ట్రంలో బీజేపీ బలోపేతం కాకపోవడంతో పాటు జనసేనతో నామమాత్రంగా సంబంధాలు ఉండడానికి సోము వీర్రాజసు వైఖరే కారణమని కన్నా లక్ష్మీనారాయణ ఆరోపణలు చేశారు. సోము వీర్రాజు వైఖరిని కన్నా లక్ష్మీనారాయణ బహిరంగంగానే తప్పుబట్టారు. కన్నా లక్ష్మీనారాయణ విమర్శలపై సోము వీర్రాజు స్పందించలేదు. రాష్ట్రంలో ఏం జరుగుతుందో పార్టీ అధిష్టానానికి తెలుసునని ఆయన సోము వీర్రాజు వ్యాఖ్యలు చేశారు.
మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణకు నిన్న బీజేపీ అగ్రనేత ఒకరు ఫోన్ చేసినట్టుగా ప్రచారం సాగుతుంది. తొందరపడి ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని కన్నా లక్ష్మీనారాయణకు సూచించినట్టుగా కన్నా వర్గీయులు చెబుతున్నారు. పార్టీలో చోటు చేసుకున్న పరిణామాలను కన్నా లక్ష్మీనారాయణ ఈ సందర్భంగా పార్టీ అగ్రనేతలకు వివరించినట్టుగా సమాచారం.
ఇవాళ భీమవరంలో జరిగే పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలకు కన్నా లక్ష్మీనారాయణ ఉద్దేశ్యపూర్వకంగా దూరంగా ఉన్నారనే ప్రచారాన్ని ఆయన వర్గీయులు తోసిపుచ్చుతున్నారు.వ్యక్తిగత కారణాలతో కన్నా లక్ష్మీనారాయణ ఇవాళ రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి దూరంగా ఉన్నారని వారు చెబుతున్నారు