టీడీపీ చీఫ్ చంద్రబాబు జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలని మాజీ మంత్రి హరిరామ జోగయ్య సూచించారు.
అమరావతి: జగన్ ను గద్దె దింపాలంటే పవన్ కళ్యాణ్ ను సీఎం చేసేందుకు చంద్రబాబు ముందుకు రాక తప్పదని మాజీ మంత్రి హరిరామజోగయ్య చెప్పారు.ఆదివారంనాడు జరిన కాపు సంక్షేమ సంఘం సమావేశంలో కాపు సంక్షేమ సేన తరపున హరిహార జోగయ్య పాల్గొన్నారు. ఈ సమావేశంలో జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్, జనసేన పొలిటికల్ ఓఫైర్స్ కమిటీ చైర్మెన్ నాదెండ్ల మనోహర్ తదితరులు పాల్గొన్నారు.ఈ సమావేశంలో హరిరామజోగయ్య కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబునాయుడు జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలని హరిరామజోగయ్య సూచించారు. లోకేష్ ను అధికారంలో భాగస్వామ్యం చేయాలని ఆయన సూచించారు. టీడీపీ, జనసేన మధ్య సయోధ్య సాధ్యమంటూనే టీడీపీపై హరిరామజోగయ్య విమర్శలు చేశారు.
రాష్ట్రంలో వైసీపీ ఎన్ని వ్యూహలు పన్నుతుందో టీడీపీ కూడా అదే తరహలో ప్రణాళికలతో ముందుకు వెళ్తుందన్నారు. జనసేనను బలహీనం చేసేందుకు టీడీపీ ప్రయత్నిస్తుందని ఆయన ఆరోపించారు. కన్నా లక్ష్మీనారాయణ, మహాసేన రాజేష్ లాంటి ప్రముఖులను జనసేనలో చేరకుండా టీడీపీలో చేర్పించుకున్న విషయం వాస్తవం కాదా అని ఆయన ప్రశ్నించారు. జనసేనకు 20 సీట్లు, చంద్రబాబుకు సీఎం పదవి అంటూ సోషల్ మీడియాలో టీడీపీ ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.
undefined
జగన్ పోవాలి , పవన్ రావాలి అనేది కాపు సంక్షేమ సంఘం లక్ష్యం కావాలన్నారు. విపక్షాలు కలిసి పోరాటం చేయాలని చంద్రబాబు అంటున్నారన్నారు. కానీ రాజ్యాదికారం మాత్రం తమ చేతుల్లోనే పెట్టాలని బాబు అంటున్నారని మాజీ మంత్రి జోగయ్య తెలిపారు. జనసేనను బలహీనపర్చేందుకు చంద్రబాబుప్రయత్నాలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. వైసీపీ, టీడీపీలపై పవన్ కళ్యాణ్ యుద్ధం ప్రకటించాలని ఆయన కోరారు.
: