యూట్యూబ్ విలేకరి హత్య కేసు: నిందితులకు 14 రోజుల రిమాండ్.. కానిస్టేబుల్‌పై సస్పెన్షన్ వేటు

Siva Kodati |  
Published : Aug 10, 2021, 08:41 PM IST
యూట్యూబ్ విలేకరి హత్య కేసు: నిందితులకు 14 రోజుల రిమాండ్.. కానిస్టేబుల్‌పై సస్పెన్షన్  వేటు

సారాంశం

కర్నూలు జిల్లాలో నంద్యాలలో ఓ యూట్యూబ్ ఛానెల్ విలేకరి హత్య కేసులో నిందితులకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీనితో పాటు నిందితుడిగా వున్న కానిస్టేబుల్‌ వెంకట సుబ్బయ్యపై ప్రభుత్వం వేటు వేసింది.

కర్నూలు జిల్లాలో నంద్యాలలో ఓ యూట్యూబ్ ఛానెల్ విలేకరి హత్య కేసులో నిందితుడిగా వున్న కానిస్టేబుల్‌పై ప్రభుత్వం వేటు వేసింది. ఆయనను సర్వీసు నుంచి తొలగిస్తూ జిల్లా ఎస్పీ ఆదేశాలు జారీ చేశారు. ఈ కేసులో నిందితులు కానిస్టేబుల్ వెంకట సుబ్బయ్య, అతడికి సహకరించిన నాగేశ్వరరావుకు 14 రోజుల రిమాండ్ విధించి కోర్టు.

కాగా నంద్యాలలో యూట్యూబ్ ఛానెల్ వీ5 విలేకరిగా పనిచేస్తున్న కేశవను కానిస్టేబుల్ సుబ్బయ్య, అతని సోదరుడు పగపట్టి హత్య చేశారు. కేశవ వారం కిందట గుట్కా వ్యాపారితో టూటౌన్‌ కానిస్టేబుల్‌ సుబ్బయ్యకు ఉన్న సంబంధాలను బట్టబయలు చేశారు. దీనిపై సోషల్‌ మీడియాలో ప్రచారం చేశారు. ఈ విషయం తెలుసుకుని జిల్లా ఎస్పీ సుధీర్‌కుమార్‌రెడ్డి కానిస్టేబుల్‌ సుబ్బయ్యను సస్పెండ్‌ చేశారు. దీన్ని జీర్ణించుకోలేని కానిస్టేబుల్‌ సుబ్బయ్య ఆదివారం రాత్రి మాట్లాడాలని చెప్పి కేశవను ఎన్జీవోస్‌ కాలనీలోని ఆటోస్టాండ్‌ వద్దకు పిలిపించాడు.

Also Read:నంద్యాలలో జర్నలిస్ట్ దారుణ హత్య..: కానిస్టేబుల్ పనే?

కేశవ తోటి రిపోర్టర్‌ ప్రతాప్‌తో కలిసి ఎన్జీవోస్‌ కాలనీకి వెళ్లారు. అక్కడ కేశవతో ప్రత్యేకంగా మాట్లాడాలని సుబ్బయ్య, అతడి తమ్ముడు నాని గదిలోకి తీసుకెళ్లారు. కొద్ది నిమిషాలకే ఆ గదిలోంచి గట్టిగా కేకలు వినిపించటంతో ప్రతాప్‌ వెళ్లాడు. అక్కడ తీవ్రగాయాలతో ఉన్న కేశవను ఆటోలో నంద్యాల ప్రభుత్వాస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించాడు. 

అప్పటికే కేశవ మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. పదునైన ఆయుధంతో కేశవ వీపు వెనుకభాగంలో తీవ్రంగా పొడిచినట్లు వైద్యులు తెలిపారు. కానిస్టేబుల్‌ అవినీతి వ్యాపారాన్ని బట్టబయలు చేసిన విలేకరిని హత్యచేయటం పట్ల జర్నలిస్ట్‌ సంఘాలు ఆందోళన చెందుతున్నాయి. 
 

PREV
click me!

Recommended Stories

CM Chandrababu Massive Speech | స్టేజిని షేక్ చేసిన Chandrababu | Asianet Telugu
Bonda Uma ని చూసి CM Chandrababu Reaction చూడండి | Asianet Telugu