సీటు నీకు లేదు.. మీ భార్యకే ఇస్తామని జగన్ చెప్పిన చేసేది ఏమి లేదు: మాజీ మంత్రి బాలినేని

Published : Jan 23, 2023, 05:22 PM IST
 సీటు నీకు లేదు.. మీ భార్యకే ఇస్తామని జగన్ చెప్పిన చేసేది ఏమి లేదు: మాజీ మంత్రి బాలినేని

సారాంశం

ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సీఎం వైఎస్ జగన్ పదవుల విషయంలో మహిళలకే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని అన్నారు.

ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సీఎం వైఎస్ జగన్ పదవుల విషయంలో మహిళలకే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని అన్నారు. ‘‘సీఎం  జగన్ సీటు నీకు లేదు.. మీ భార్యకే ఇస్తామని చెప్పిన కూడా చేసేది ఏమి లేదు. ఎమ్మెల్యే టికెట్లు కూడా మహిళలకే ఎక్కువ శాతం ఇస్తారేమో’’ అని బాలినేని అన్నారు. ఇక, కొండెపి వైసీపీ ఇంఛార్జ్ అశోక్‌బాబుపై పలువురు అసంతృప్తితో ఉన్నారని.. అయితే విభేదాలు మరిచి కలిసికట్టుగా పని చేయాలని పార్టీ శ్రేణులకు ఆయన సూచించారు. 

Also Read: నిబంధనలకు లోబడే అనుమతులు.. నారా లోకేష్ పాదయాత్రపై చిత్తూరు ఎస్పీ కీలక వ్యాఖ్యలు..

ఇదిలా ఉంటే.. వైసీపీ చీరాల అభ్యర్థి ఎవరనే దానిపై కొనసాగుతున్న ఉత్కంఠపై బాలినేని శ్రీనివాసరెడ్డి ఆదివారం స్పష్టతనిచ్చారు. చీరాల నుంచి వైసీపీ అభ్యర్థి కరణం వెంకటేషేనని శ్రీనివాసరెడ్డి తెలిపారు.ఇదే విషయాన్ని సీఎం జగన్‌ ఇటీవల ఎమ్మెల్యే బలరాం, వెంకటేష్‌కు కూడా చెప్పారని బాలినేని పేర్కొ న్నారు. 
 

PREV
click me!

Recommended Stories

జగన్ రాకతో కర్నూలులో స్తంభించిన ట్రాఫిక్ | YS Jagan Kurnool tour | Asianet News Telugu
స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు విజయవాడలో రిహార్సిల్స్ | Independence Day rehearsals