ఏపీ సీఐడీ చీఫ్ సునీల్ బదిలీ: కొత్త డీజీగా సంజయ్ నియామకం

Published : Jan 23, 2023, 05:09 PM ISTUpdated : Jan 23, 2023, 05:15 PM IST
ఏపీ సీఐడీ చీఫ్ సునీల్ బదిలీ:  కొత్త డీజీగా  సంజయ్ నియామకం

సారాంశం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీఐడీ చీప్ గా  ఉన్న సునీల్ కుమార్ ను ప్రభుత్వం  ఇవాళ బదిలీ చేసింది. ఆయనను జీఏడీలో  రిపోర్టు  చేయాలని  ఆదేశించింది. 

అమరావతి:  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీఐడీ చీఫ్  సునీల్ కుమార్ ను సోమవారం నాడు బదిలీ చేసింది  ప్రభుత్వం. సునీల్ కుమార్ స్థానంలో ఎన్. సంజయ్ ను నియమించింది  జగన్ సర్కార్. ఈ మేరకు  ఇవాళ  ఉత్తర్వులు జారీ చేసింది.  ప్రస్తుతం  ఫైర్ సర్వీసెస్  శాఖ డీజీగా  సంజయ్ కొనసాగుతున్నారు.  సీఐడీ డీజీగా  ఇవాళ బదిలీ చేసింది.  ఫైర్ సర్వీసెస్ ను కూడా  అదనంగా  సంజయ్ కి కేటాయించింది. 1996 ఐపీఎస్ బ్యాచ్ కి అధికారి  సంజయ్.  ఏపీ సీఐడీ చీఫ్ గా ఉన్న  సునీల్ కుమార్  ను ఆకస్మాత్తుగా  బదిలీ చేయడం ప్రస్తుతం  చర్చకు  దారి తీసింది.  

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో చలి తుపాను బీభత్సం.. ఆల్ టైమ్ రికార్డ్ టెంపరేచర్స్ తో ఇక్కడ అల్లకల్లోలమే
Cold Wave Alert : ఈ మూడ్రోజులు తస్మాత్ జాగ్రత్త.. ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం..!