జగన్, మంత్రులపై వ్యాఖ్యలు: మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు అరెస్ట్

Published : Sep 01, 2023, 11:38 AM ISTUpdated : Sep 01, 2023, 11:45 AM IST
జగన్, మంత్రులపై వ్యాఖ్యలు:  మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు అరెస్ట్

సారాంశం

మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడిని  కృష్ణా జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు.

విశాఖపట్టణం: మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడిని కృష్ణా జిల్లా పోలీసులు  శుక్రవారం నాడు విశాఖపట్టణంలో అరెస్ట్ చేశారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలోని గన్నవరంలో నిర్వహించిన  యువగళం సభలో  ఏపీ సీఎం  వైఎస్ జగన్, వైఎస్ఆర్‌సీపీ  నేతలపై విమర్శలు చేశారు. దీంతో  మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడిని  ఇవాళ  కృష్ణా జిల్లా పోలీసులు అరెస్ట్  చేశారు.

ఈ ఏడాది ఆగస్టు  22న  గన్నవరంలో  యువగళం సభ నిర్వహించారు.ఈ సభలో  ఏపీ సీఎం వైఎస్ జగన్ సహా పలువురు మంత్రులపై  అయ్యన్నపాత్రుడు తీవ్ర విమర్శలు చేశారు.ఈ విమర్శలపై  మాజీ మంత్రి పేర్నినాని  కృష్ణా జిల్లాలోని ఆతుకూరు  పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.ఈ ఫిర్యాదు మేరకు  పోలీసులు కేసు నమోదు చేశారు.  ఇవాళ హైద్రాబాద్ నుండి  విశాఖపట్టణం వచ్చిన  మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడిని  విశాఖపట్టణం ఎయిర్ పోర్టులోనే  కృష్ణా జిల్లా పోలీసులు అరెస్ట్  చేశారు.  గన్నవరం సభలో  మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడితోపాటు  బుద్దా వెంకన్నపై  కూడ  కేసు నమోదైన విషయం తెలిసిందే.

అవకాశం దొరికినప్పుడల్లా సీఎం జగన్ తో పాటు  మంత్రులపై  మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు తీవ్ర విమర్శలు చేస్తుంటారు. ఈ రకమైన విమర్శల నేపథ్యంలో  ఆయనపై  పలు  కేసులు కూడ నమోదైన విషయం తెలిసిందే. యువగళం  సభలో సీఎం జగన్ పై తీవ్ర విమర్శలు చేయడంతో  ఆయనపై నమోదైన కేసులో  కృష్ణా జిల్లా పోలీసులు అయ్యన్నపాత్రుడిని  అరెస్ట్  చేశారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?
Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?