అల్లూరి సీతారామరాజు జిల్లాలోని బాలికల హస్టల్ నుండి ముగ్గురు విద్యార్థినులు అదృశ్యమయ్యారు. బాలికల అదృశ్యం గురించి పేరేంట్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
న్యూఢిల్లీ: అల్లూరి జిల్లా చింతపల్లి గర్ల్స్ హస్టల్ నుండి ముగ్గురు విద్యార్థినులు అదృశ్యమయ్యారు. ఈ విషయమై హస్టల్ వార్డెన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. విద్యార్థినుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
విద్యార్థినులు హస్టల్ నుండి కన్పించకుండా పోయిన తర్వాత హస్టల్ లో పనిచేసే సిబ్బంది సక్రమంగా వ్యవహరించలేదని కన్పించకుండా పోయిన విద్యార్ధినుల పేరేంట్స్ ఆరోపిస్తున్నారు. హస్టల్ ముందు బైఠాయించి ఆందోళనకు దిగారు. విద్యార్ధినులు ఎక్కడికి వెళ్లారనే విషయమై పోలీసులు దర్యాప్తు చేస్తున్నాయి.
undefined
గతంలో కూడ విద్యార్థినులు కన్పించకుండా పోయిన ఘటనలు రెండు తెలుగు రాష్ట్రాల్లో చోటు చేసుకున్నాయి. ఈ నెల 18న చిత్తూరు జిల్లాలో ఒకే రోజు ఐదుగురు అమ్మాయిలు కన్పించకుండా పోయారు. ఈ మేరకు జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్లలో అమ్మాయిల మిస్సింగ్ లపై కేసులు నమోదయ్యాయి.
పల్నాడు జిల్లాలోని నర్సరావుపేటలో ఇంటర్ చదివే విద్యార్ధిని కాలేజీకి వెళ్లి కన్పించకుండా పోయింది. దీంతో విద్యార్థిని పేరేంట్స్ ఆందోళనకు దిగారు.ఈ నెల 18న ఈ ఘటన చోటు చేసుకుంది.
ఈ ఏడాది జూన్ 24న విశాఖపట్టణంలోని ముగ్గురు విద్యార్ధినులు కన్పించకుండా పోయారు. ఈ ఘటనపై బాధిత విద్యార్థినుల పేరేంట్స్ పోలీసులకు పిర్యాదు చేశారు. కన్పించకుండా పోయిన ముగ్గురు విద్యార్థినులు స్నేహితులు.