భయపడేది లేదు,ఎర్రన్న సాక్షిగా చెబుతున్నా నా పాత్ర నిరూపించు: జగన్‌కు అచ్చెన్న సవాల్

By narsimha lodeFirst Published Feb 23, 2020, 5:52 PM IST
Highlights

ఈఎస్ఐ కుంభకోణంలో తన పాత్ర ఉన్నట్టు నిరూపించాలని మాజీ మంత్రి అచ్చెన్నాయుడు సీఎం జగన్ కు సవాల్ విసిరారు. 


శ్రీకాకుళం: ఈఎస్ఐ కుంభకోణంలో తన పాత్ర ఉన్నట్టు నిరూపించాలని  మాజీ మంత్రి అచ్చెన్నాయుడు ఏపీ సీఎం వైఎస్ జగన్ సవాల్ విసిరారు. తాను మంత్రిగా ఉన్న సమయంలో చేసిన పాలనకు సంబంధించిన ఫైళ్లు ఉన్నాయని నీ ఇష్టమొచ్చింది చేసుకోవాలన్నారు.

ఆదివారం నాడు శ్రీకాకుళం జిల్లా నిమ్మాడలో జరిగిన దివంగత ఎర్రన్నాయుడు జయంతి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.  ఈ సందర్భంగా సీఎం జగన్ కు మాజీ మంత్రి అచ్చెన్నాయుడు సవాల్ విసిరారు. 

 ఈఎస్ఐ కుంభకోణంలో తాను తప్పు చేసినట్టుగా తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. జగన్ బెదిరింపులకు  భయపడేందుకు ఇక్కడ ఎవరూ కూడ లేరన్నారు. ఎర్రన్నాయుడు సాక్షిగా తాను చెబుతున్నా నేను ఏ తప్పు చేయలేదని  అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. 

Also read:ఈఎస్ఐ స్కాం: అసలు రేట్లకు రెట్టింపు చెల్లింపులు, మూడు కంపెనీలదే హవా

 డబ్బులు అవసరం ఉంటే పది మంది బిక్షాటన చేసుకొని కార్యక్రమాలు నిర్వహిస్తానని ఆయన మరోసారి స్పష్టం చేశారు. నీకు ఓ పత్రిక, టీవీ ఉందని నీ ఇష్టం వచ్చినట్టుగా ప్రచారం చేయడం వల్ల జడిసిపోయే కుటుంబం తమది కాదని అచ్చెన్నాయుడు చెప్పారు. 

Also read:పితానిని తాకిన ఈఎస్ఐ స్కాం :టీడీపీ, వైసీపీ వాదనలు ఇవీ

ఈఎస్ఐ కుంభకోణంలో టెలీ హెల్త్ సర్వీసెస్ కు నామినేషన్ పద్దతిలో  కాంట్రాక్టు ఇవ్వాలని విజిలెన్స్ కమిటీ రిపోర్టు ఇచ్చింది. మాజీ మంత్రి అచ్చెన్నాయుడుతో పాటు మరో మాజీ మంత్రి పితానా సత్యనారాయణ పేరు కూడ  తెర మీదికి వచ్చింది.ఈ ఇద్దరు మాజీ మంత్రులు ఈ కుంభకోణంలో తమ పాత్ర లేదని స్పష్టం చేశారు. కానీ వేసీపీ నేతలు మాత్రం ఈ విషయమై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. 
 

click me!