బాలికల హస్టల్‌లో చికెన్ బిర్యానీ వండి పెట్టిన యువకులు

By narsimha lodeFirst Published Feb 23, 2020, 4:56 PM IST
Highlights

కృష్ణా జిల్లాలోని బాలికల హస్టల్ లో  పది మంది యువకులు మూడున్నర గంటల పాటు గడిపారు. చికెన్ బిర్యానీ, హల్వా వండారు. ఈ సమయంలో హస్టల్ లో వార్డెన్ లేరు. 

విజయవాడ: కృష్ణా జిల్లాలోని మచిలీపట్నంలో ఓ బాలికల వసతి గృహంలో సుమారు 10 మంది యువకులు సుమారు మూడున్నర గంటలకు పైగా  గడిపారు. హస్టల్ కిచెన్‌లో వంట చేసి మరీ వండి పెట్టారు. ఈ సమయంలో హస్టల్ వార్డెన్ లేదు. ఈ విషయం తెలిసిన పలు పార్టీల నాయకులు హస్టల్‌కు చేరుకొని పరిస్థితి గురించి ఆరా తీశారు.

ఇదే జిల్లాలోని నూజివీడు ట్రిపుల్ కాలేజీకి అనుబంధంగా ఉన్న బాలికల హస్టల్‌ లో ఓ యువకుడు రాత్రి మొత్తం ఉన్నాడు. మరునాడు ఉదయం ఒకే గదిలో యువతీ యువకులున్నారు. ఈ విషయం తెలిసిన సిబ్బంది పట్టుకొన్నారు.

ఈ విషయం మర్చిపోక ముందే మరో ఘటన అదే జిల్లాలో చోటు చేసుకొంది. మచిలీపట్నం బాలికల హస్టల్‌లో శనివారం నాడు సాయంత్రం సుమారు 10 మంది యువకులు హస్టల్ కు వచ్చారు. హస్టల్ కిచెన్ లోకి వెళ్లి వంట చేశారు. హల్వా, బిర్యానీ చేసి వండి పెట్టారు. 

గత ఏడాది చనిపోయిన ఓ వ్యక్తి జయంతిని పురస్కరించుకొని  హల్వా, బిర్యానీ వండి పెట్టారని హస్టల్ విద్యార్ధిని మీడియాకు తెలిపారు. బాలికల హస్టల్‌లో  సుమారు 10 మంది యువకులు మూడున్నర గంటల పాటు గడిపారు. 

ఈ విషయం తెలిసిన పలు పార్టీలకు చెందిన నేతలు, బీసీ సంఘం నేతలు  హస్టల్ ను సందర్శించారు. ఈ సమయంలో హస్టల్‌లో వార్డెన్ లేరు.  బాలికల హస్టల్‌లో వార్డెన్ లేకపోవడంపై కూడ ఆయా పార్టీల నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. 
 

click me!