కర్నూల్ జిల్లాలో వైసీపీ వర్గాల మధ్య పోరు: చెన్నంపల్లెలో పోలీస్ పికెట్

By narsimha lodeFirst Published Feb 23, 2020, 3:31 PM IST
Highlights

కర్నూల్ జిల్లాలోని ఆవుకు మండలం చెన్నంపల్లెలో వైసీపీకి చెందిన రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకొంది. 


కర్నూలు జిల్లా అవుకు మండలం చెన్నంపల్లె గ్రామంలో వైస్సార్సీపీకి చెందిన బిజ్జం పార్థసారథి రెడ్డి.కాట్రెడ్డి మల్లికార్జున రెడ్డి.లకు చెందిన రెండు గ్రూపులుగా చీలిపోయారు.

2014 లో అసెంబ్లీ ఎన్నికల్లో బిజ్జం పార్థసారథి రెడ్డి టీడీపీ అభ్యర్థి బీసీ జనార్ధన్ రెడ్డి కి సపోర్ట్ చేయగా కాట్రెడ్డి మల్లికార్జున రెడ్డి కాటసాని రామిరెడ్డి కి సపోర్ట్ చేశారు.అప్పటి ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి బీసీ జనార్దన్ రెడ్డి విజయం సాధించారు.

2020 లో అసెంబ్లీ ఎన్నికల్లో  బిజ్జం పార్థసారథి రెడ్డి.వర్సెస్ కాట్రెడ్డి మల్లికార్జున రెడ్డి ఇద్దరు కలిసి కాటసాని రామిరెడ్డి కి సపోర్ట్ చేయడం జరిగింది కాటసాని రామిరెడ్డి విజయం సాధించారు.

రానున్న పంచాయితీ ఎన్నికల్లో  బిజ్జం వర్గీయులు కిరణ్ కుమార్ రెడ్డి పోటీ చేస్తారని పేరు బలంగా వినపడుతోంది ఈ నేపధ్యంలో గ్రామంలో తమదే హవా కొనసాగాలని పెట్టుకున్న కిరణ్ కుమార్ రెడ్డి పెట్టుకొన్నాడని ప్రత్యర్థి వర్గం ఆరోపిస్తోంది. 

 ఆదివారం ఆంజనేయస్వామి గుడి  వద్ద కిరణ్ కుమార్ రెడ్డి కూర్చొన్నాడు.  అదే సమయంలో మారేమడుగుల శివారెడ్డి తన పొలం పనులకు వెళ్తుండగా కాలు ఊపి మీసం తిప్పాడు. నన్ను చూసి మీసాలు తిప్పుతావా అని ప్రశ్నించిన శివారెడ్డి. ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగింది.  దీంతో కిరణ్ కుమార్ రెడ్డిపై శివారెడ్డి చేయి చేసుకొన్నాడు.

దీంతో రెండు వర్గాలు ఒకరిపై మరోకరు పరస్పరం దాడి చేసుకొన్నారు.  ఈ దాడుల విషయాన్ని తెలుసుకొన్న పోలీసులు గ్రామంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. 
 

click me!