నెల్లూరు రూరల్ వైసీపీ ఇంచార్జ్‌గా ఎంపీ ప్రభాకర్ రెడ్డి.. వచ్చే ఎన్నికల్లో అక్కడి నుంచే పోటీ..

Published : Feb 02, 2023, 05:19 PM IST
నెల్లూరు రూరల్ వైసీపీ ఇంచార్జ్‌గా ఎంపీ ప్రభాకర్ రెడ్డి.. వచ్చే ఎన్నికల్లో అక్కడి నుంచే పోటీ..

సారాంశం

నెల్లూరు రూరల్ నియోజకవర్గం వైసీపీ ఇంచార్జ్‌గా అదాల ప్రభాకర్‌ రెడ్డి నియమితులయ్యారు. సీఎం జగన్‌తో భేటీ అనంతరం వైసీపీ నాయకులు ఈ ప్రకటన చేశారు. 

నెల్లూరు రూరల్ నియోజకవర్గం వైసీపీ ఇంచార్జ్‌గా అదాల ప్రభాకర్‌ రెడ్డి నియమితులయ్యారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యేగా ఉన్న కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వైసీపీని వీడనున్నట్టుగా ప్రకటించిన నేపథ్యంలో.. అక్కడి పరిణామాలపై వైసీపీ అధిష్టానం దృష్టిసారించింది. ఈ క్రమంలోనే పార్లమెంట్ సమావేశాల నిమిత్తం ఢిల్లీలో ఉన్న అదాల ప్రభాకర్‌ రెడ్డిని వెంటనే ఏపీకి చేరుకున్నారు. అనంతరం మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి, ఇతర ముఖ్య నేతలతో కలిసి ప్రభాకర్ రెడ్డి తాడేపల్లిలో సీఎం జగన్‌‌ను కలిశారు. 

ఈ భేటీ అనంతరం అదాల ప్రభాకర్ రెడ్డిని నెల్లూరు రూరల్ వైసీపీ ఇంచార్జ్‌గా నియమించినట్టుగా ఆ పార్టీ ప్రకటించింది. ప్రస్తుతం ఎంపీగా ఉన్న అదాల ప్రభాకర్ రెడ్డి.. వచ్చే ఎన్నికల్లో నెల్లూరు రూరల్‌ నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తారని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. సీఎం జగన్‌ను కలిసిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నారు. 

బాలినేని శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. నెల్లూరు రూరల్ పార్టీ ఇంచార్జ్‌గా అదాల ప్రభాకర్ రెడ్డి పేరును సీఎం జగన్ ఖరారు చేశారని చెప్పారు. ఇకపై అక్కడ వైసీపీకి చెందిన అన్ని కార్యక్రమాలు ప్రభాకర్ రెడ్డి నేతృత్వంలోనే జరుగుతున్నాయని చెప్పారు. 

PREV
click me!

Recommended Stories

AP Municipal Elections 2026 : టీడీపీ మేయర్, మున్సిపల్ ఛైర్ పర్సన్ అభ్యర్థులు వీళ్లే...
Kotamreddy Sridhar Reddy Serious Warning to YS Jagan | Punganur Incident | TDP Vs YCP