అశాస్త్రీయంగా జిల్లాల విభజనతో నష్టం: ఆనం రామనారాయణ రెడ్డిసంచలనం

By narsimha lodeFirst Published Feb 16, 2022, 4:10 PM IST
Highlights


జిల్లాల ఏర్పాటు అంశానికి సంబంధించి మాజీ మంత్రి ఆనం రామ నారాయణరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాక్యలు ప్రస్తుతం వైసీపీలో కలకలం రేపుతున్నాయి. 

నెల్లూరు: New District ఏర్పాటు విషయమై వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నెల్లూరు , బాలాజీ జిల్లాల మధ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

బుధవారం నాడు మాజీ మంత్రి Anam Ramana Narayana Reddy నెల్లూరు జిల్లాలో మీడియాతో మాట్లాడారు. వెంకటగిరి నియోజకవర్గంలోని సైదాపురం, కలువాయి, రాపూరు మండలాలను నెల్లూరు జిల్లాలోనే కొనసాగించాలని వైసీపీ నేతలు డిమాండ్  చేస్తున్నారు.  జిల్లా విభజనలో Venkatagiriకి అన్యాయం జరిగిందన్నారు. డిలిమిటేషన్, రాష్ట్ర విభజన సమయాల్లో ప్రజలు నష్టపోయారన్నారు. మళ్లీ నష్టపోవడానికి సిద్ధంగా  ప్రజలు సిద్దంగా లేరన్నారు. నాగార్జున సాగర్ డ్యామ్‌పై రెండు రాష్ట్రాల  పోలీసుల మధ్య జరుగుతున్న దాడుల మాదిరిగా Nellore-Balaji జిల్లాల పోలీసులకు సమస్యలు వచ్చే అవకాశముందన్నారు. శాస్త్రబద్ధంగా నీళ్లు, నిధుల గురించి చట్టపరంగా ఆలోచించి జిల్లాల విభజన చేస్తే బాగుండేదని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇలాంటి అశాస్త్రీయ విధానం బాధ కలిగిస్తోందని ఆనం రామనారాయణరెడ్డి అన్నారు.

కొత్త జిల్లాల ఏర్పాటు విషయమై ఇప్పటికే కొన్ని జిల్లాల్లో ఆందోళనలు సాగుతున్నాయి. YCPకి చెందిన ప్రజా ప్రతినిధులు ప్రస్తుతం ఈ విషయమై వ్యాఖ్యలు చేయడం కలకలం రేపుతోంది. జిల్లాలకు పేర్లు పెట్టే విషయంతో పాటు జిల్లాల కేంద్రాలు ఏర్పాటు తదితర అంశాలపై కూడా ఆందోళనలు సాగుతున్నాయి. అయితే మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి చేసిన వ్యాఖ్యలు మాత్రం ప్రస్తుతం కలకలం రేపుతున్నాయి. గతంలో కూడా ఆనం రామనారాయణరెడ్డి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత సీఎం జగన్ తో భేటీ అయిన తర్వాత అసెంబ్లీ ఆనం రామనారాయణరెడ్డి టీడీపీపై విమర్శలు గుప్పించారు. కానీ ఆ తర్వాత ఆనం రామనారాయణ రెడ్డి ఎలాంటి సంచలన వ్యాఖ్యలు చేయలేదు. కానీ ఇవాళ మాత్రం మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై వైసీపీ నాయకత్వం ఏం చేస్తోందోననేది సర్వత్రా ఆసక్తి నెలకొంది. 

కొత్త జిల్లాలపై వచ్చే అన్ని రకాల అభ్యంతరాలు, సూచనలను  క్షుణ్ణంగా పరిశీలించి, అధ్యయనం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కమిటీ ఏర్పాటుచేసింది. ప్రణాళిక శాఖ కార్యదర్శి, సీసీఎల్‌ఏ కార్యదర్శి, అన్ని జిల్లాల కలెక్టర్లతో ఈ కమిటీని ఏర్పాటుచేశారు.  కొత్త జిల్లాలకు సంబంధించి అభ్యంతరాలు, సూచనలను జిల్లా కలెక్టర్లకు ఇచ్చేందుకు సర్కారు 30 రోజుల గడువు ఇచ్చింది. ఆయా జిల్లాల్లో కలెక్టర్లు వీటిని స్వీకరిస్తున్నారు. తాము అందుకున్న విజ్ఞప్తులను కలెక్టర్లు www. drp.ap.gov.in వెబ్‌ సైట్‌లో ప్రతీరోజూ అప్‌లోడ్‌ చేయాల్సి వుంటుంది. ఇలా అప్‌లోడ్‌ చేసే ప్రతి అభ్యంతరం, సూచనను పరిశీలించి దానిపై రిమార్కు రాయాలి.

ఆ తర్వాత వాటిని కలెక్టర్లు, రాష్ట్రస్థాయి అధికారుల కమిటీ పరిశీలిస్తుంది. వచ్చిన అభ్యంతరాలు, సలహాలను ఈ కమిటీ పూర్తిగా అధ్యయనం చేసి అది సహేతుకమైనదా? పరిగణలోకి తీసుకోవాలా లేదా? అని నిర్ణయం తీసుకుంటుంది. ప్రతి అభ్యంతరం, పరిశీలనను స్వీకరించాలా? తిరస్కరించాలో? చెబుతూ ఈ కమిటీ సిఫారసు చేస్తుంది. ఈ సిఫార్సుల ఆధారంగా జిల్లాల పునర్వ్యవస్థీకరణపై ఏమైనా మార్పులు, చేర్పులు చేయాల్సి వుంటే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో ఏర్పాటైన ఉన్నత స్థాయి కమిటీ తుది నిర్ణయం తీసుకోనుంది.
 


 

click me!