సినిమా టికెట్ ధరలు.. రేపు సచివాలయంలో ప్రభుత్వ కమిటీ భేటీ, టాలీవుడ్‌ దృష్టంతా అటే

Siva Kodati |  
Published : Feb 16, 2022, 03:01 PM IST
సినిమా టికెట్ ధరలు.. రేపు సచివాలయంలో ప్రభుత్వ కమిటీ భేటీ, టాలీవుడ్‌ దృష్టంతా అటే

సారాంశం

సినిమా టికెట్ రేట్లకు సంబంధించి ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ ఫిబ్రవరి 17న సమావేశం కానుంది. అనంతరం ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది.  ఒకవేళ సినిమా టికెట్ రేట్లు పెరిగితే మాత్రం ఫిబ్రవరి 25న విడుదల కాబోయే పవన్ కల్యాణ్ నటించిన భీమ్లా నాయక్ సినిమాకు బాగా హెల్ప్ కానుంది. 

టాలీవుడ్‌ (tollywood) ఈ మధ్య కాలంలో గతంలో ఎన్నడూ లేని విధంగా తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటోంది. ఓ వైపు కరోనా వైరస్ (coronavirus) .. మరోవైపు ఏపీలో టికెట్ రేట్లు (ticket rates) .. ఇలా వరసపెట్టి శరాఘాతాలుగా తగులుతున్నాయి. ఈ విషయంపై సినీ ప్రముఖులు సిఎం జగన్‌తో భేటీ అవుతున్నారు కానీ ఇప్పటి వరకు ఎలాంటి అనుకూలమైన ప్రకటనా వెలువడలేదు. ఏపీలో టికెట్స్ ఇష్యూ ఇంకా ఓ కొలిక్కి రాకపోవడంతో పెద్ద సినిమాలు వాయిదాపడుతూ వస్తున్నాయి. 

తెలంగాణలో ఓవైపు టికెట్ రేట్లు ఎక్కువయ్యాయనే వాదన జరుగుతుంటే.. ఇక్కడ మాత్రం 5 రూపాయల టికెట్‌పై రగడ జరుగుతుంది. ఇదిలా ఉంటే సినిమా టికెట్ రేట్లను సవరిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో 35ను సవాల్ చేస్తూ కొందరు కోర్టుకు వెళ్లారు. ఆ తర్వాత చిరంజీవి (chiranjeevi) నేతృత్వంలోని సినీ ప్రముఖుల బృందం, నిన్న మా అధ్యక్షుడు మంచు విష్ణు (manchu vishnu) జగన్‌తో భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలో సినిమా టికెట్ రేట్లకు సంబంధించి ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ ఫిబ్రవరి 17న సమావేశం కానుంది. 

ఇప్పటికే ఆలస్యమైనందున టికెట్ ధరలపై ఈ కమిటీ ఏదో ఒకటి తేల్చాల్సి ఉంది. వెలగపూడిలో సచివాలయంలో 11.30 నిమిషాలకు ఈ భేటీ జరగనుంది. అనంతరం ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది.  ఒకవేళ సినిమా టికెట్ రేట్లు పెరిగితే మాత్రం ఫిబ్రవరి 25న విడుదల కాబోయే పవన్ కల్యాణ్ నటించిన భీమ్లా నాయక్ సినిమాకు బాగా హెల్ప్ కానుంది. ఆ తర్వాత వరుణ్ తేజ్ గని, ఆడవాళ్లు మీకు జోహార్లు, రాధే శ్యామ్, ఆచార్య లాంటి సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానుంది. 

మరోవైపు సినిమా రంగ సమస్యలకు సంబంధించి ఏపీ సీఎం వైఎస్ జగన్‌తో (ys jagan) మా  అధ్యక్షుడు (maa president) మంచు విష్ణు భేటీ (manchu vishnu)  అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సినిమా రంగానికి సంబంధించి చాలా విషయాలు మాట్లాడుకున్నామన్నారు. తిరుపతిలో ఫిల్మ్ స్టూడియో పెడతానని మంచు విష్ణు సంచలన ప్రకటన చేశారు. సినీ  పరిశ్రమ  రెండు రాష్ట్రాలకు రెండు కళ్లు అన్న ఆయన.. విశాఖకు ఎలా షిఫ్ట్ అవ్వాలి అనే దానిపై ఆలోచిస్తామి విష్ణు తెలిపారు. మా నాన్నను కూడా ప్రభుత్వం ఆహ్వానించిందని.. కానీ కొందరు దానిని మోహన్‌బాబుకు (mohan babu) చేరనివ్వలేదని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆహ్వానం చేరకుండా ఎవరు చేశారో తమకు తెలుసునంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. విశాఖకు పరిశ్రమ వెళ్లే విషయంపై ప్రభుత్వంతో మాట్లాడుతున్నామన్నారు.  

కాగా.. గతవారం చిరంజీవి నేతృత్వంలోని సినీ ప్రముఖుల బృందం జగన్‌తో భేటీ కావడం పరిశ్రమలోని మరొక వర్గం నొచ్చుకునేలా చేసింది. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అద్యక్షుడిగా ఉన్న మంచు విష్ణు, అత్యంత సీనియర్ నటుడు అయిన మోహన్ బాబుకు ఆహ్వానం లేకపోవడం వారిని ఒకింత నిరాశకు గురిచేసింది. చిత్ర పరిశ్రమ నుండి చిరంజీవికి సీఎం జగన్ ప్రత్యేక గౌరవం ఇచ్చినట్లు అయ్యింది. పరిశ్రమకు పెద్ద ఎవరనే చర్చ కొన్నాళ్లుగా కొనసాగుతుండగా.. సీఎంతో భేటీ నేపథ్యంలో చిరంజీవినే అని నిర్ధారించినట్లు అయ్యింది. 

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్