తనపై ప్రభుత్వం విధించిన సస్పెన్షన్ ముగిసిందని మాజీ ఇంటలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు చెప్పారు. ఏపీ సీఎస్ సమీర్ శర్మకు ఇవాళ ఆయన లేఖ రాశారు.
అమరావతి:తన సస్పెన్షన్ పూర్తైనట్టేనని ఏపీ రాష్ట్ర మాజీ intelligence చీఫ్ AB Venkateswara Rao చెప్పారు. ఈ మేరకు ఏబీ వెంకటేశ్వరరావు శుక్రవారం నాడు ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి Sameer Sharma కు లేఖ రాశారు.
తనను ఇంకా suspension లో కొనసాగించే అధికారం ప్రభుత్వానికి లేదని ఆ letterలో ఏబీ వెంకటేశ్వరరావు చెప్పారు.తనపై సస్పెన్షన్ విధించి రెండేళ్లు పూర్తైందన్నారు. దీంతో తనపై విధించిన సస్పెన్షన్ తొలగిపోయినట్టేనని ఏబీ వెంకటేశ్వరరావు సమీర్ శర్మకు రాసిన లేఖలో పేర్కొన్నారు.
తనపై విధించిన సస్పెన్షన్ పై ఆరు నెలల చొప్పున పొడిగించారన్నారు. తనపై విధించిన సస్పెన్షన్ ఈ ఏడాది జనవరి 27వ తేదీతో ముగిసిందన్నారు.2021 జూలైలో తనపై విధించిన సస్పెన్షన్ ను చివరిసారిగా పొడిగించిన విషయాన్ని వెంకటేశ్వరరావు గుర్తు చేశారు.
తనపై విధించిన సస్పెన్షన్ కు సంబంధించిన జీవోలను రహస్యంగా ఉంచారని కూడా ఆ లేఖలో పేర్కొన్నారు. కానీ తనకు కూడా కాపీ ఇవ్వలేదని ఆయన గుర్తు చేశారు. ఎలా చూసినా కూడా తన సస్పెన్షన్ ముగిసిందని ఆయన తేల్చి చెప్పారు.
రెండేళ్లకు మించి సస్పెన్షన్ కొనసాగించాలంటే కేంద్ర హోంశాఖ అనుమతి తీసుకోవాల్సిందేనని చెప్పారు. గడువులోపుగా కేంద్ర home ministry నుండి తన సస్పెన్షన్ ను పొడిగించాలని కోరలేదని ఆ లేఖలో సీఎస్ కు గుర్తు చేశారు. దీంతో తన సస్పెన్షన్ ముగిసినట్టేనని ఆయన గుర్తు చేశారు.సర్వీస్ రూల్స్ ప్రకారంగా తన సస్పెన్షన్ పూర్తైనందున తనకు పూర్తి జీతం ఇవ్వాలని కూడా ఆయన ఆ లేఖలో సమీర్ శర్మను కోరారు.