2019 వరకు ఏపీ ప్రభుత్వ సంస్థ కూడా పెగాసెస్ సాఫ్ట్ వేర్ ను ఉపయోగించలేదని ఏపీ రాష్ట్ర మాజీ ఇంటలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు చెప్పారు.
అమరావతి: 2019 మే వరకు ఏ ప్రభుత్వ సంస్థ కూడా పెగాసెస్ సాఫ్ట్‌వేర్ ను వాడలేదని ఏపీ రాష్ట్ర మాజీ ఇంటలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు చెప్పారు.
మాజీ ఇంటలిజెన్స్ డీజీ AB Venkateswara Raoసోమవారం నాడు సాయంత్రం విజయవాడలో మీడియాతో మాట్లాడారు. ప్రజల్లో ఉన్న భయాల్ని తొలగించాల్సిన పని ప్రభుత్వానిదని ఆయన చెప్పారు. అప్పటి DGP ఆఫీస్ కాకుండా మరొకరు కొని ఉండొచ్చని కొందరు ఆరోపణలు చేస్తున్నారన్నారు. ఏపీ ప్రభుత్వంలో నిఘా చీఫ్ గా ఉన్న తనకు ఈ విషయమై పూర్తి సమాచారం ఉందని ఆయన గుర్తు చేశారు. Phone Hacking కానీ,Tapping కానీ జరగలేదని ఆయన తేల్చి చెప్పారు. Pegasus పై సందేహాలను నివృత్తి చేయాల్సి బాధ్యత తనపై కూడా ఉందని ఆయన చెప్పారు. అందుకే ఈ విషయమై తాను మీడియా ముందుకు వచ్చానని ఏబీ వెంకటేశ్వరరావు తెలిపారు. ఎప్పుడూ కొనని సాఫ్ట్‌వేర్ గురించి నేను సమాధానం చెప్పాలనడం హాస్యాస్పదమని ఏబీ వెంకటేశ్వరరావు అన్నారు.పెగాసెస్ ను కొనుగోలు చేయలేదని ఆర్టీఏ చట్టం ప్రకారం బయటకు వచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.పెగాసెస్ వల్ల ప్రజల్లో అభద్రతా భావం నెలకొందన్నారు. పెగాసెస్ పై అసత్యాలు, అసంబద్ద వాదనలతో ప్రజలను గందరగోళంలోకి నెట్టవద్దన్నారు.
తనపై వచ్చిన ఆరోపణలు పరమ టైమ్ వేస్ట్ తప్ప మరొకటి కాదని ఏబీ వెంకటేశ్వరరావు చెప్పారు. ఏ విచారణకు తాను వెనుకంజ వేయలేదని చెప్పారు. తనను తప్పుడు కేసులో ఇరికించేందుకు కొందరు అధికారులు తప్పుడు పత్రాలతో విఫలయత్నాలు చేశారని ఏబీ వెంకటేశ్వరరావు చెప్పారు. ఈ విషయమై ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి కూడా మూడు సార్లు విన్నవించినట్టుగా వెంకటేశ్వరరావు గుర్తు చేశారు. కొందరు అధికారుల ప్రయత్నాలపై రుజువులను కూడా సమర్పించి విచారణ జరిపించాలని కోరినా ఇంతవరకు కూడా స్పందన లేదని ఏబీ వెంకటేశ్వరరావు తెలిపారు.
తన సస్పెన్షన్ ఇష్యూ Supreme court లో పెండింగ్ లో ఉందన్నారు. ఏ విచారణను కూడా తాను తప్పించుకోలేదని ఆయన వివరించారు. అంతేకాదు తనపై వచ్చిన ఆరోపణలను త్వరగా తేల్చాలని కోరుతున్నానన్నారు.ఇదే విషయమై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఇవాళ కూడా కోరినట్టుగా ఏబీ వెంకటేశ్వరరావు వివరించారు. తనపై suspension విధించిన సమయంలో తప్పుడు ప్రచారం చేశారన్నారు. తనపై చార్జీషీట్ లో మాత్రం చేర్చలేదన్నారు.
నేను ఏ.పీలోనే పుట్టాను
తాను నాగాలాండ్‌లోనో ఇతర రాష్ట్రంలో పుట్టలేదని ఏబీ వెంకటేశ్వరరావు చెప్పారు. తాను ఏపీ రాష్ట్రంలోనే పుట్టానన్నారు. చిన్నతనం నుండి చదువు పూర్తయ్యే వరకు ప్రభుత్వ విద్యా సంస్థల్లోనే చదివినట్టుగా ఆయన వివరించారు. తన గురువులు, పేరేంట్స్ చూపిన బాటలోనే తాను కొనసాగానని ఏబీ వెంకటేశ్వరరావు చెప్పారు. రాష్ట్రంలోని 10 జిల్లాల్లో పనిచేశానన్నారు. అంతే కాదు విజయవాడలో రెండు దఫాలు కమిషనర్ గా పనిచేసిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. తాను ఏనాడూ కూడా తప్పుడుగా ప్రవర్తించలేదన్నారు. తనకు చీము, నెత్తురు, సిగ్గూ, శరం, లజ్జ ఉందన్నారు.తనపై వచ్చిన ఆరోపణలపై వివరణ ఇవ్వాల్సి ఉందన్నారు. తనపై తప్పుడు ప్రచారం చేసి వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే ప్రచారం చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.