పెగాసెస్‌పై హౌస్ కమిటీతో విచారణ జరిపిస్తామని ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రకటించారు. ఏపీ అసెంబ్లీలో ఇవాళ పెగాసెస్ అంశంపై విచారణ జరిగింది.
అమరావతి: Pegasus పై హౌస్ కమిటీతో విచారణ జరిపిస్తామని ఏపీ అసెంబ్లీ స్పీకర్ Tammineni Sitaram ప్రకటించారు. ఈ విషయమై ఏపీ రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సహా ఇతర సభ్యులు కోరిన మీదట హౌస్ కమిటీ విచారణకు స్పీకర్ ఆదేశించారు.
పెగాసెస్ అంశంపై ఏపీ అసెంబ్లీలో సోమవారం నాడు చర్చ జరిగింది. ఈ చర్చలో ఏపీ రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి Buggana Rajendranathపాల్గొన్నారు.Chandrababu Naidu పెగాసెస్ సాఫ్ట్ వేర్ కొనుగోలు చేశారని బెంగాల్ సీఎం Mamata Benarjee అసెంబ్లీలోనే ప్రకటించారని ఆయన గుర్తు చేశారు. కచ్చితమైన సమాచారం ఉండి ఉంటేనే మమత బెనర్జీ ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారని ఆయన గుర్తు చేశారు.
పెగాసెస్ వంటి స్పైవేర్ తో వ్యక్తిగత స్వేచ్ఛకు విఘాతం కలుగుతుందన్నారు. ఈ సాఫ్ట్ వేర్ తో వ్యక్తిగత వివరాలను కూడా తెలుసుకొనే అవకాశం కూడా ఉందన్నారు. ఇలాంటి అనైతిక కార్యక్రమాలు ఇల్లీగల్ గానే చేస్తారని ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చెప్పారు. ఇది ప్రమాదమే కాదు అనైతికం కూడా అని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చెప్పారు. ఇలాంటి ప్రమాదకర సాఫ్ట్‌వేర్ ను చంద్రబాబు కొన్నారంటే ఎంత దుర్మార్గమన్నారు.పెగాసెస్‌తో ఏమేమీ చేశారో దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందని బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు.
ఇది రాష్ట్రానిదే కాదు దేశ భద్రతకు సంబంధించిన అంశమని మంత్రి బుగ్గన అభిప్రాయపడ్డారు. మిస్డ్ కాల్ ద్వారా కూడా ఈ సాఫ్ట్ వేర్ ను ఫోన్ లో చొప్పించ ప్రమాదకర సాఫ్ట్ వేర్ ఇది అని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చెప్పారు. దొంగతనం అందరికీ తెలిసేలా ఎలా చేస్తారని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రశ్నించారు.
2021 మార్చి 18న Vijayawada లో ఒక ఫిర్యాదు గురించి ఏపీ ఆర్ధిక మంత్రి బుగ్గన గుర్తు చేశారు. డ్రోన్ల కొనుగోలు కు సంబంధించి అవకతవకలకు సంబంధించి ఈ ఫిర్యాదు అందిందన్నారు. మాజీ ఇంటలిజెన్స్ డీజీ AB Venkateswara Rao పై ఈ ఫిర్యాదు అందిందని చెప్పారు.
Drones కొనుగోలుకు సంబంధించి నియమ నిబంధనల ప్రకారం వ్యవహరించాలని DGPఆదేశాలు జారీ చేశారని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గుర్తు చేశారు. అయితే డ్రోన్ల కొనుగోలుకు సంబంధించి నాలుగు కంపెనీలు టెండర్లు వేశాయన్నారు. అయితే ఏబీ వెంకటేశ్వరరావు తనయుడి ఆకాశం కంపెనీకే ఈ టెండర్ దక్కిందని బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గుర్తు చేశారు. ఇల్లీగల్ పనిని అనైతికంగా చేస్తారు కాబట్టే రుజుువులు దొరకవని ఏపీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చెప్పారు.
Telanganaలోని హైద్రాబాద్‌లోని మాదాపూర్ లో ఐటీ గ్రిడ్ పై కేసు నమోదైన విషయాన్ని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గుర్తు చేశారు.ఐటీ గ్రిడ్ ద్వారా టీడీపీ కార్యకర్తలు ఏపీలోని ఓటర్లపై నిఘా పెట్టారని చెప్పారు. టీడీపీకి ఓటేయకపోతే ఆ ఓట్లను తొలగించే ప్రయత్నం చేశారని బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వివరించారు.
ప్రజా సాధికారిత సర్వే, సేవా మిత్ర ద్వారా ఓటర్ల నుండి టీడీపీ క్యాడర్ సేకరించిందన్నారు. ఈ సమాచారం ఆధారంగా ఓటర్లు టీడీపీకి ఓటు వేస్తారా వేయరా అనే సమాచారాన్ని సేకరించి ఓటర్లను తొలగించారని బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చెప్పారు. పెగాసెస్ అంశానికి సంబంధించి House Committee ద్వారా విచారణ చేయించాలని ఆయన డిమాండ్ చేశారు.
ఇదే విషయమై ఏపీ రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి కూడా పలువురు సభ్యులు విచారణకు డిమాండ్ చేసిన విషయాన్ని స్పీకర్ దృష్టికి తీసుకొచ్చారు. హౌస్ కమిటీ ద్వారా విచారణ చేయాలని కోరారు. దీంతో ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం హౌస్ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టుగా ప్రకటించారు.,