బీజేపీలోకి మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి!.. కీలక బాధ్యతలు అప్పగించే చాన్స్..!

Published : Mar 11, 2023, 09:00 AM ISTUpdated : Mar 11, 2023, 09:15 AM IST
బీజేపీలోకి మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి!.. కీలక బాధ్యతలు అప్పగించే చాన్స్..!

సారాంశం

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పార్టీ మారేందుకు సిద్దమైనట్టుగా తెలుస్తోంది.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పార్టీ మారేందుకు సిద్దమైనట్టుగా తెలుస్తోంది. కిరణ్ కుమార్ రెడ్డి త్వరలోనే బీజేపీ కండువా కప్పుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు ఇప్పటికే బీజేపీ అగ్రనేతలు కిరణ్ కుమార్ రెడ్డితో చర్చలు జరిపినట్టుగా సమాచారం. మరో రెండు, మూడు రోజుల్లోనే కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్‌కు రాజీనామా చేయబోతున్నట్టుగా  తెలుస్తోంది. ఆ తర్వాత ఆయన బీజేపీ అగ్రనేతల సమక్షంలో కాషాయ కండువా కప్పుకుంటారని సమాచారం. హైదరాబాద్ కేంద్రంగా తెలంగాణ  బీజేపీలో ఆయన యాక్టివ్ రోల్ పోషించే అవకాశం ఉన్నట్టుగా ప్రచారం సాగుతుంది. మరోవైపు ఆయనకు జాతీయ స్థాయిలో కీలక బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందనే వాదన కూడా ఉంది. 

కాంగ్రెస్‌తోనే రాజకీయ జీవితం ప్రారంభించిన కిరణ్ కుమార్ రెడ్డి.. పార్టీలో పలు పదవులు చేపట్టారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభపతిగా కూడా పనిచేశారు. 2010 నవంబర్‌లో ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆఖరి ముఖ్యమంత్రిగా రాష్ట్ర విభజనను తీవ్రంగా వ్యతిరేకించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నేపథ్యంలో.. కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పిన కిరణ్ కుమార్  రెడ్డి జై సమైక్యాంధ్ర పార్టీ ఏర్పాటు చేసుకున్నారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన పార్టీ ఒక్క సీటు కూడా సొంతం చేసుకోలేదు. 

ఆ తర్వాత నాలుగేళ్ల పాటు సైలెంటుగా ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి.. తిరిగి కాంగ్రెస్ గూటికి చేరారు. అయితే ఏపీలో కాంగ్రెస్ పరిస్థితి అధ్వాన్నంగా ఉండటంతో కిరణ్ కుమార్ రెడ్డి అంతా యాక్టివ్‌గా కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. అయితే కొంతకాలంగా కిరణ్ కుమార్ రెడ్డి పార్టీ మారనున్నారనే ప్రచారం సాగుతూనే ఉంది. బీజేపీ పెద్దలు  ఆయనతో టచ్‌లో ఉన్నారనే ప్రచారం సాగింది. అయితే తాజాగా కిరణ్ కుమార్ రెడ్డి.. బీజేపీలో చేరేందుకు రంగం సిద్దం చేసుకున్నారు. ఆయనకు పార్టీలో ఏ విధమైన బాధ్యతలు అప్పగిస్తారనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్