చర్చకు రెడీ ..ప్లేస్ , టైమ్ చెప్పు : నారా లోకేష్‌కు మిథున్ రెడ్డి సవాల్, చిత్తూరులో వేడెక్కిన రాజకీయం

Siva Kodati |  
Published : Mar 10, 2023, 09:37 PM IST
చర్చకు రెడీ ..ప్లేస్ , టైమ్ చెప్పు : నారా లోకేష్‌కు మిథున్ రెడ్డి సవాల్, చిత్తూరులో వేడెక్కిన రాజకీయం

సారాంశం

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌కు సవాల్ విసిరారు వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి. ఈ నెల 12న తంబళ్లపల్లెలో చర్చకు తాను సిద్ధమని  ప్లేస్, టైమ్ చెప్పాలని మిథున్ రెడ్డి అన్నారు.

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలకు వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి స్పందించారు. ఈ నెల 12న తంబళ్లపల్లెలో చర్చకు తాను సిద్ధమని సవాల్ విసిరారు. ప్లేస్, టైమ్ చెప్పాలని మిథున్ రెడ్డి అన్నారు. చిత్తూరు జిల్లా డీఎన్ఏ నీ బ్లడ్‌లో వుంటే తనతో పోటీ చేయాలంటూ ఎంపీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నోటికి ఏది వస్తే అది మాట్లాడటం సరికాదని.. ఎవరో రాసిచ్చింది చదవకూడదన్నారు. 

ఇదిలావుండగా.. తన యువగళం పాదయాత్రలో భాగంగా ప్రస్తుతం అన్నమయ్య జిల్లాలో వున్నారు నారా లోకేష్. ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి కుటుంబంపై తీవ్ర విమర్శలు చేశారు. చిత్తూరు జిల్లాను గుప్పిట్లో పెట్టుకుని .. దోచుకుంటున్నారని ఆయన ఆరోపించారు. మదనపల్లెకి ఏం చేశావంటూ మిథన్ రెడ్డిని ప్రశ్నించారు. తాను తంబళ్లపల్లెలోనే వుంటానని.. చిత్తూరు జిల్లా అభివృద్ధిపై చర్చకు తాను సిద్ధమని లోకేష్ సవాల్ విసిరారు. మీలాగా తాము తప్పు చేయమని.. అభివృద్ధి మాత్రమే చేస్తామని ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. అయితే ఇద్దరు యువ నేతల మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్ల నేపథ్యంలో చిత్తూరు జిల్లా రాజకీయం వేడెక్కింది. 

Also REad: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు.. టీడీపీ ట్విస్ట్ ఇవ్వనుందా?.. చంద్రబాబు వ్యుహాత్మక అడుగులు..!!

అంతకుముందు నారా లోకేష్ పై మాజీ మంత్రి కొలుసు పార్థసారథి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.కేసీఆర్ ఎలాయితే తనయుడు కేటీఆర్ ను ముఖ్యమంత్రి చేయాలని అనుకుంటున్నాడో చంద్రబాబు కూడా లోకేష్ గురించి అలాగే తాపత్రయపడుతున్నాడు. కానీ లోకేష్ పాదయాత్రలో పిల్లకాకి, పిల్లకుంకలాగ మాట్లాడుతున్నాడని పార్థసారథి తీవ్రవ్యాఖ్యలు చేశారు. ఎక్కడా టిడిపి అధికారంలోకి వస్తే ప్రజలకు ఏం చేస్తారో చెప్పడంలేదు... సీఎం జగన్ గురించి ఓ లోఫర్, జోకర్ మాట్లాడుతున్నాడని ఆయన మండిపడ్డారు. జగన్ కాలి గోటికి కూడా పనికిరానని లోకేష్ గుర్తించాలని పార్ధసారథి చురకలంటించారు.  


 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Odisha Governor Kambhampati Hari Babu Speechవిశాఖలో ఘనంగా మహా సంక్రాంతి వేడుకలు| Asianet News Telugu
CM Chandrababu at Naravaripalli నారావారి పల్లి లో గోమాతకి పూజ చేసిన సీఎం చంద్రబాబు| Asianet Telugu