జగన్ బరితెగించాడు, పిచ్చోడిలా ప్రవర్తిస్తున్నాడు: చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

By Nagaraju penumalaFirst Published Oct 31, 2019, 8:18 PM IST
Highlights

 జగన్ బరితెగించారని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు రాస్తే కేసు పెట్టాలని జీవో తెచ్చారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వార్త రాస్తే ముందు వ్యక్తిపై క్రిమినల్ కేసులు పెడతారని ఆ తర్వాత కోర్టుల్లో కేసులు పెడతారని ఇదెంత దారుణమైన నిర్ణయమంటూ తిట్టిపోశారు. 

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు. జగన్ బరితెగించారని మామూలుగా బరితెగించలేదంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 

ఒక నియంత కూడా చేయని విధంగా మీడియాపై ఆంక్షలు విధించారంటూ తిట్టిపోశారు. దేశచరిత్రలో ఎక్కడా జరగదన్నారు. మీడియాపై ఆంక్షలు విధిస్తూ అధికారులకు, పోలీసులకు జీవోలు జారీ చేయడంపై మండిపడ్డారు.  తన రాజకీయ జీవితంలో ఇలాంటి జీవోను చూడలేదని ఆయన వ్యాఖ్యానించారు. 

గతంలో జగన్ తండ్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి కూడా జీవో 938ను విడుదల చేసినట్లు చెప్పుకొచ్చారు. ఆ సమయంలో మీడియా ప్రతినిధులు ఆందోళన చేస్తే తాను అసెంబ్లీలో మాట్లాడానని గుర్తు చేశారు. అనంతరం ఆ జీవోను రాజశేఖర్ రెడ్డి క్యాన్సిల్ చేశారని చెప్పుకొచ్చారు. 

ప్రస్తుతం జగన్ బరితెగించారని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు రాస్తే కేసు పెట్టాలని జీవో తెచ్చారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వార్త రాస్తే ముందు వ్యక్తిపై క్రిమినల్ కేసులు పెడతారని ఆ తర్వాత కోర్టుల్లో కేసులు పెడతారని ఇదెంత దారుణమైన నిర్ణయమంటూ తిట్టిపోశారు. 

ఇలాంటి జీవోలు ఇచ్చేందుకు ఎవరూ ధైర్యం చేయలేరని కానీ జగన్ చేశారని మండిపడ్డారు. జగన్ ఒక పిచ్చివాడిలా ఇవన్నీ చేస్తున్నారంటూ మండిపడ్డారు. ఇది ఒక పిచ్చి చర్య అంటూ తిట్టిపోశారు. ప్రజాస్వామ్యాన్ని అపహాసం చేయాలనుకునేవారు చరిత్రలో కలిసిపోయారని మండిపడ్డారు. 

ఎలాంటి ఆలోచన లేకుండా జీవోను విత్ డ్రా చేసుకోవాలని డిమాండ్ చేశారు. మీడియాకు భేషరతుగా క్షమాపణలు చెప్పాలన్నారు. ప్రజాస్వామ్యవాదులందరికీ క్షమాపణలు చెప్పాలని హెచ్చరించారు. 

మీడియాను నియంత్రించేలా జగన్ విడుదల చేసిన జీవో రద్దు అయ్యేవరకు తాము పోరాటం చేస్తామని హెచ్చరించారు. అన్ని పత్రికలు, న్యూస్ ఛానెల్స్  అధినేతలకు లేఖలు రాస్తామని వారితో చర్చిస్తామన్నారు. జీవోను రద్దు చేసేవరకు జాతీయ స్థాయిలో పోరాటం చేస్తామని మీడియా పక్షాన పోరాటం చేస్తామని తెలిపారు. 

రాష్ట్రవ్యాప్తంగా నిరసన చేస్తామని, సదస్సులు పెడతామని తెలిపారు. అందరూ కలిసి జీవోను రద్దు చేసేవరకు పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. ఇలా కేసులు పెడితే సాక్షి పేపర్, సాక్షి ఛానెల్ తమపై ఎన్నో తప్పుడు వార్తలు రాశాయని వాటిపై తాము ఎన్నికేసులు పెట్టాలని నిలదీశారు. 

రాజ్యాంగానికి వ్యతిరేకంగా జగన్ ప్రవర్తిస్తున్నారంటూ మండిపడ్డారు. ఫోర్త్ ఎస్టేట్ అయిన మీడియాపై ఆంక్షలు విధించడం, భయభ్రాంతులకు గురి చేయడం శోచనీయమన్నారు చంద్రబాబు నాయుడు.

వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ, విపక్షాలపై పడ్డారని చెప్పుకొచ్చారు. టీడీపీ నేతలపై ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టి వేధించారని ఆరోపించారు. సోషల్ మీడియాలో టీడీపీ నేతలను అరెస్ట్ చేశారని మండిపడ్డారు. ఇప్పుడు మీడియాను టార్గెట్ చేశారంటూ చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ వార్తలు కూడా చదవండి

అది ప్రజల హక్కు దాని పై మీ బోడిపెత్తనం ఏంటి: జగన్ ప్రభుత్వంపై చంద్రబాబు మండిపాటు

పవన్ కు చంద్రబాబు గుడ్ న్యూస్: నీతోనే ఉంటామన్న మాజీ సీఎం
 

click me!