ఆ అధికారంతోనే స్థానిక సంస్థల ఎన్నికల వాయిదా: రిప్లై పిటిషన్ లో నిమ్మగడ్డ

By narsimha lodeFirst Published Apr 27, 2020, 12:53 PM IST
Highlights

రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పూర్తిస్థాయి దాఖలుకు సంబంధించి మాజీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్  సోమవారం నాడు రిప్లై పిటిషన్ దాఖలు చేశారు. రెండు రిప్లై పిటిషన్లను ఆయన దాఖలు చేశారు.
 

అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పూర్తిస్థాయి దాఖలుకు సంబంధించి మాజీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్  సోమవారం నాడు రిప్లై పిటిషన్ దాఖలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల సంఘం దాఖలు చేసిన పిటిషన్లకు సంబంధించి మాజీ ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కౌంటర్ ఇచ్చారు. రెండు రిప్లై పిటిషన్లలో తన అభిప్రాయాన్ని స్పష్టం చేశారు. 

రాష్ట్ర ప్రభుత్వం 17 పేజీల కౌంటర్ పిటిషన్ ను ఈ నెల 24న హైకోర్టుకు సమర్పించిన విషయం తెలిసిందే. మరునాడే రాష్ట్ర ఎన్నికల సంఘం కూడ కౌంటర్ వేసింది. ఈ రెండింటికి నిమ్మగడ్డ రమేష్ కుమార్ సోమవారం నాడు రిప్లై పిటిషన్ లో వివరణ ఇచ్చారు.

రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల షెడ్యూల్ కుదించడంపై ఎన్నికల సంఘంతో చర్చించలేదని రిప్లై పిటిషన్ లో నిమ్మగడ్డ ప్రస్తావించారు.ఈ విషయాన్ని కేంద్రానికి నివేదించినట్టుగా చెప్పారు.

Also read:నిమ్మగడ్డ లేఖలో ట్విస్ట్: సీఐడీ దర్యాప్తులో సంచలనాలు, ఆధారాలు ధ్వంసం

ఈ దఫా స్థానిక సంస్థల ఎన్నికల్లో హింసాత్మక ఘటనల అంశాన్ని కూడ ఆయన తన రిప్లై పిటిషన్ లో ప్రస్తావించారు. ఇదే విషయాన్ని కేంద్రానికి లేఖ రాసినట్టుగా ఆయన స్పష్టం చేశారు.

2014 లో ఎంపీటీసీ ఎన్నికల్లో 1 శాతం ఏకగ్రీవమయ్యాయన్నారు. ఈ దఫా 24 శాతం ఏకగ్రీవమైన విషయాన్ని ఆయన రిప్లై పిటిషన్ లో ప్రస్తావించారు. గతంలో జడ్పీటీసీ ఎన్నికల్లో 1 శాతం ఏకగ్రీవమయ్యాయన్నారు. ఈ దఫా జడ్పీటీసీ ఎన్నికల్లో 126 శాతం ఏకగ్రీవమైన విషయాన్ని ఆయన పేర్కొన్నారు.

కడప జిల్లాల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలు ఏకగ్రీవమైన విషయాన్ని కూడ రమేష్ కుమార్ రిప్లై పిటిషన్ లో ప్రస్తావించారు. ప్రతి విషయాన్ని కూడ ఎన్నికల సంఘంలో పనిచేసే ఉద్యోగులతో చర్చించాల్సిన అవసరం లేదని రమేష్ కుమార్ చెప్పారు.

ఎన్నికల సంఘం కమిషనర్ గా తనకున్న విచక్షణాధికారంతో కొన్ని నిర్ణయాలు తీసుకొనే అధికారం ఉంటుందన్నారు. ఎన్నికల వాయిదా విషయాన్ని కూడ ఇలానే తీసుకొన్నట్టుగా ప్రస్తావించారు. ఎన్నికల వాయిదా అనే విషయం అందరితో చర్చించాల్సిన అంశం కాదన్నారు. దీన్ని గోప్యంగా ఉంచాల్సి ఉందన్నారు.రాష్ట్ర ప్రభుత్వం లేవనెత్తిన అంశాలపై ఆయన వివరణ ఇచ్చారు.

click me!