కనగరాజ్ ప్రమాణం వల్లే రాజ్ భవన్ లో కరోనా: జవహర్ ఆరోపణ

Published : Apr 27, 2020, 11:43 AM ISTUpdated : Apr 27, 2020, 11:44 AM IST
కనగరాజ్ ప్రమాణం వల్లే రాజ్ భవన్ లో కరోనా: జవహర్ ఆరోపణ

సారాంశం

బాధ్యతారహితంగా వ్యవహరించి కనగరాజుతో ఎస్ఈసీగా ప్రమాణ స్వీకారం చేయించడం వల్లనే రాజ్ భవన్ లోని సిబ్బందికి కరోనా వైరస్ సోకిందని టీడీపీ నేత, మాజీ మంత్రి జవహర్ ఆరోపించారు

అమరావతి: అధికారం ఉందనే పొగరుతో రాష్ట్రంలో లాక్ డౌన్ నిబందనలు తుంగలో తొక్కి కరోనా పాజిటివ్ కేసులు పెంచిన ఘనత 
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంకి దక్కిందని మాజీమంత్రి జవహర్ వ్యాఖ్యానించారు ఈ మేరకు తన కార్యాలయం నుంచి సోమవారం ఒక పత్రిక ప్రకటన విడుదల చేశారు. 

కేంద్ర ప్రభుత్వం కరోనా వైరస్ నిర్మూలనలో భాగంగా లాక్ డౌన్ విధిస్తే జగన్ ప్రభుత్వం మాత్రం నిర్లక్షదోరణితో రాజ్ భవన్ లో  ఈ నెల 11న నూతన ఎన్నికల అధికారిగా కనగరాజుతో ప్రమాణ స్వీకారం చేయించారన్నారు. దీని కారణంగా  రాజ్ భవన్లో  పనిచేసి సిబ్బందికి కరోనా వైరస్ సోకిందని ఆవేదన వ్యక్తం చేశారు. 

బాధ్యత లేని జగన్ ప్రభుత్వాన్ని తక్షణమే బర్తరఫ్ చేసి ప్రజల ప్రాణాలను కాపాడాలని జవహర్ అన్నారు. విపత్కర సమయంలో చెన్నై నుంచి కనగరాజుని ఏ విధంగా తీసుకువచ్చి ఎన్నికల అధికారిగా ప్రమాణం చేయించారో ప్రజలకు జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలని ప్రశ్నించారు.  అదేవిధంగా రాష్ట్ర నూతన ఎన్నికల అధికారి కనగరాజు క్వారంటైన్లో ఉన్నారా...? ఆంధ్రప్రదేశ్ నుంచి చెన్నై వెళ్లిపోయరా అని జవహర్  మండిపడ్డారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాజ్ భవన్ లో నలుగురు సిబ్బందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. చీఫ్ సెక్యురిటి ఆఫీసర్,  వైద్య సహాయకుడు, పని మనిషి, హౌస్ కీపింగ్ సిబ్బందికి కరోనా సోకినట్లు తేలింది. గవర్నర్ కి సైతం వైద్య పరీక్షలు నిర్వహించారు. 

విజయవాడలో  ఆదివారం సుమారు 30కేసులు నమోదయ్యాయి. కృష్ణలంకలో 3, మాచవరంలో  2, రైల్వే ఆస్పత్రిలో 2 కేసులు నమోదయ్యాయి.మాచవరం పీఎస్ లో నాలుగు, నున్నలో ఒక కేసులు రికార్డయ్యాయి, సైబర్ సెల్ మహిళా ఎస్సైకి పాజిటివ్ వచ్చినట్లు తేలింది.

ఇదిలావుంటే, తుళ్లూరు మండలం రాయపూడి గ్రామంలో కరోనా అనుమానపు కేసు నమోదైంది. అమీనుద్దిన్ అనే ఎస్ఐ కొంతకాలంగా విధులు నిర్వహిస్తూ రాయపూడిలో బంధువుల వద్ద ఉంటున్నాడు. అతనికి తూర్పు గోదావరి జిల్లా కు చెందిన ఫాతిమాతో వివాహం నిశ్చయమైంది. 

వీరిద్దరికీ జ్వరం రావడంతో కరో నా  అనుమానిత కేసుగా  అధికారులు  వైద్య పరీక్షలకు పంపారు. ఒకే ఇంటిలో ఏడుగురు వుంటున్నారని భౌతిక దూరం పాటించడం లేదని స్థానికులు చెబుతున్నారు.

ఇదిలావుంటే, శనివారం ఉదయం 10  నుంచి ఆదివారం ఉదయం 10 గంటల వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా 81 కేసులు నమోదయ్యాయి. కృష్ణా జిల్లాలో అత్యధికంగా 52 కేసులు నమోదయ్యాయి.

PREV
click me!

Recommended Stories

Tirupati : టీటీడీలో మరో భారీ కుంభకోణం.. నకిలీ పట్టు వస్త్రాల పేరుతో రూ.55 కోట్ల మోసం
IMD Cold Wave Alert : ఈ ఐద్రోజులు అల్లకల్లోలమే... ఈ జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్స్