కాపు అవినీతి సరిహద్దులు దాటింది - ఏపీ మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు

Published : Jul 07, 2022, 03:00 PM IST
కాపు అవినీతి సరిహద్దులు దాటింది - ఏపీ మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు

సారాంశం

ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి కర్ణాటక కాంట్రాక్టర్ లను బెదిరిస్తున్నారని ఏపీ మాజీ మంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో స‌భ్యుడు కాలవ శ్రీనివాసులు ఆరోపించారు. గురువారం ఆయన అనంతపురంలో మీడియాతో మాట్లాడారు. 

ఏపీ ప్రభుత్వ విప్, రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డిపై మాజీ మంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో స‌భ్యుడు కాలవ శ్రీనివాసులు తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. రామ‌చంద్రారెడ్డి అవినీతి రాష్ట్ర సరిహద్దులను దాటిందని అన్నారు. తుంగభద్ర రిజర్యాయరు కింద హెచ్ ఎల్ సీ, ఎల్ ఎల్ సీ కాలువ ఆధునికీకరణ పనులను కర్ణాటక రాష్ట్ర పరిధిలో చేస్తున్న కాంట్రాక్టర్లను కమీషన్లు ఇవ్వాలని ఆయ‌న బెదిరించ‌డం స‌రి కాద‌ని అన్నారు. డ‌బ్బుల కోసం ప‌క్క రాష్ట్రంలో కాంట్రాక్ట‌ర్ల‌ను ను ఒత్తిడి చేసి ఆయ‌న అవినీతిని స‌రిహ‌ద్దులు దాటించారని ఆరోపించారు. 

ఇంత‌టి రాక్షస రాజకీయం అవ‌స‌ర‌మా? ఏపీ స‌ర్కారుపై టీడీపీ నేత చింతమనేని ప్రభాకర్ ఫైర్

మూడు సంవ‌త్స‌రాలుగా రాయదుర్గం ప్రాంతంలో సహజ వనరులను, ప్రజల సొమ్మును యథేచ్ఛగా దోచుకుంటున్న రామ‌చంద్రారెడ్డి పక్క రాష్ట్ర పనులపై కన్నేయడం ఆయ‌న ప‌రాకాష్ట‌గా క‌నిపిస్తుంద‌ని తెలిపారు. ప‌క్క రాష్ట్రం కాంట్రాక్ట‌ర్ల‌ను బెదిరించి ఆయ‌న సీఎం జ‌గ‌న్ ప‌రువు తీశార‌ని విమ‌ర్శించారు. అనంతపురం జిల్లా సరిహద్దుల్లో రామ‌చంద్రారెడ్డి ప్రాతినిధ్యం వ‌హిస్తున్న సొంత నియోజ‌క‌వ‌ర్గం (రాయ‌దుర్గం)లో ఎగువ కాలువ పరిస్థితి అధ్వాన్నంగా ఉంద‌ని అన్నారు. దానివైపు ఆయ‌న ఏనాడు దాని వైపు క‌న్నెత్తి కూడా చూడ‌లేద‌ని తెలిపారు.

టీడీపీ నేతలపై నిఘా పెట్టింది వాస్తవం కాదా.. ఆడిట్‌కు సిద్ధమా : వైసీపీ ప్రభుత్వానికి పయ్యావుల సవాల్

హెచ్ ఎల్ సీ పొడ‌వునా గట్లు బలహీనంగా మారడంతో పాటు చాలా వంతెనలు శిథిలావ‌స్థ‌కు చేరుకున్నాయ‌ని అన్నారు. మూడేళ్ళ నుండి కనీస రిపేర్లు కూడా చేయ‌లేద‌ని విమ‌ర్శించారు. కానీ క‌మీష‌న్ల కోసం ప‌క్క రాష్ట్ర కాలువ‌ల‌పై ఎందుకు తిరుగుతున్నార‌ని అన్నారు. అలాంటి విప్ పై సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చ‌ర్య‌లు తీసుకోవాల‌ని అన్నారు. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో టెంపరేచర్స్ కుప్పకూలడానికి .. చలి బీభత్సానికి కారణమేంటో తెలుసా?
Tirupati : టీటీడీలో మరో భారీ కుంభకోణం.. నకిలీ పట్టు వస్త్రాల పేరుతో రూ.55 కోట్ల మోసం