TDP: జైలులో చంద్రబాబు నిరాహార దీక్ష..

By Mahesh Rajamoni  |  First Published Oct 1, 2023, 9:48 AM IST

Chandrababu Naidu's Protest: ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసు నేప‌థ్యంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ మాజీ ముఖ్య‌మంత్రి, తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్ర‌బాబు నాయుడు ప్ర‌స్తుతం జైల్లో ఉన్నారు. అయితే, చంద్ర‌బాబును అక్ర‌మంగా అరెస్టు చేశార‌నీ, సీఎం జ‌గ‌న్ స‌ర్కారు కుట్ర‌లో భాగంగానే అరెస్టు జ‌రిగింద‌ని పేర్కొంటూ టీడీపీ విమ‌ర్శ‌లు గుప్పిస్తోంది. ఈ క్ర‌మంలోనే చంద్ర‌బాబు అరెస్టును ఖండిస్తూ నారా భువ‌నేశ్వ‌రి నిరాహార దీక్ష‌కు సిద్ధ‌మ‌వుతున్నారు. అదే రోజు చంద్ర‌బాబు కూడా జైలులో నిరాహార దీక్ష చేయ‌నున్న‌ట్టు టీడీపీ పేర్కొంది.


Amaravati: ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసు నేప‌థ్యంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ మాజీ ముఖ్య‌మంత్రి, తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్ర‌బాబు నాయుడు ప్ర‌స్తుతం జైల్లో ఉన్నారు. అయితే, చంద్ర‌బాబును అక్ర‌మంగా అరెస్టు చేశార‌నీ, సీఎం జ‌గ‌న్ స‌ర్కారు కుట్ర‌లో భాగంగానే అరెస్టు జ‌రిగింద‌ని పేర్కొంటూ టీడీపీ విమ‌ర్శ‌లు గుప్పిస్తోంది. ఈ క్ర‌మంలోనే చంద్ర‌బాబు అరెస్టును ఖండిస్తూ నారా భువ‌నేశ్వ‌రి నిరాహార దీక్ష‌కు సిద్ధ‌మ‌వుతున్నారు. అదే రోజు చంద్ర‌బాబు కూడా జైలులో నిరాహార దీక్ష చేయ‌నున్న‌ట్టు టీడీపీ పేర్కొంది.

వివ‌రాల్లోకెళ్తే.. చంద్ర‌బాబు అరెస్టును ఖండిస్తూ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి నాయ‌క‌త్వంలోని వైఎస్ఆర్సీపీ ప్ర‌భుత్వంపై తెలుగుదేశం పార్టీ నేత‌లు తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. తాజాగా నారా లోకేశ్ కు సైతం ఏపీ సీఐడీ నుంచి నోటీసులు అంద‌డంతో టీడీపీ శ్రేణులు తీవ్ర ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నాయి. ఈ క్ర‌మంలోనే రంగంలోకి దిగిన నారా భువ‌నేశ్వ‌రి.. డైరెక్ట్ పాలిటిక్స్ లోకి ఎంట్రీ అవుతూ టీడీపీ శ్రేణుల్లో ఆత్మస్థైర్యాన్ని నింపుతున్నారు. త‌న కుటుంబ స‌భ్యుల అరెస్టును ఖండిస్తూ నిరాహార దీక్ష చేప‌ట్టనున్న‌ట్టు ప్ర‌క‌టించారు. 

Latest Videos

undefined

భారత జాతిపిత మ‌హాత్మా గాంధీ జయంతి రోజున చంద్ర‌బాబు అరెస్టు, త‌న కుటుంబం పై రాజ‌కీయ క‌క్ష‌సాధింపు కుట్రగా పేర్కొంటూ నిరాహారదీక్షకు సిద్దమ‌య్యారు. అలాగే, చంద్ర‌బాబు నాయుడు సైతం జైలులో నిరాహార దీక్ష చేయ‌నున్నారు. అక్టోబర్ 2న టీడీపీ చీఫ్ చంద్రబాబు జైలులోనే నిరాహార దీక్ష చేయనున్నట్లు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తెలిపారు. త‌న అక్ర‌మ అరెస్టుకు నిర‌స‌న‌గా ఈ దీక్ష కొన‌సాగుతుంద‌ని వెల్ల‌డించారు. నారా భువ‌నేశ్వ‌రితో పాటు ప‌లువురు టీడీపీ నేతలు దీక్షలో పాల్గొంటారని అచ్చెన్నాయుడు వివరించారు.

కాగా, ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కుంభకోణంలో చంద్రబాబు నాయుడును సెప్టెంబర్ 9న సీఐడీ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ప్ర‌స్తుతం ఆయ‌న‌ జ్యుడీషియల్ కస్టడీలోనే ఉన్నారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే ఈ కుంభకోణం జరిగినట్లు సీఐడీ పేర్కొంది. రాష్ట్రంలో స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్ల ఏర్పాటుకు విడుదల చేసిన రూ.371 కోట్లను డొల్ల కంపెనీలకు మళ్లించారని ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలను టీడీపీ అధినేత ఖండించారు. తనపై నమోదైన ఎఫ్ఐఆర్ ను కొట్టివేయాలని ఆయన దాఖలు చేసిన పిటిషన్ ను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు గతవారం కొట్టివేసింది. హైకోర్టు తీర్పును ఆయన సుప్రీంకోర్టులో సవాల్ చేశారు.

click me!