
టీడీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు అరెస్టు పట్ల సినీ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన జైళ్లో ఉండటం వల్ల అన్నం కూడా తినబుద్ధి కావడం లేదని ‘ఏబీఎన్ ఆంధ్రజ్యోతి’తో చెప్పారు. చంద్రబాబు నాయుడు జాతి సంపద అని తెలిపారు. ఆయనను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని చెప్పారు.
హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యపై కెనడా ఆరోపణలను తోసిపుచ్చిన భారత్.. కీలక వ్యాఖ్యలు చేసిన కేంద్రం
చంద్రబాబు నాయుడి పేరును వాడుకొని ఎంతో మంది లబ్ది పొందారని బండ్ల గణేష్ అన్నారు. ఆయన మంది జీవితాలు నిలబెట్టారని చెప్పారు. ఆయన అరెస్టు తనను ఎంతో బాధపెట్టిందని తెలిపారు. అందుకే ఈ సారి వినాయక చవితి వేడుకలను తన ఇంట్లో నిర్వహించుకోలేదని అన్నారు.
మహిళా రిజర్వేషన్ బిల్లుపై రాహుల్ గాంధీ ఏమన్నారంటే ? గతంలో ప్రధానికి రాసిన లేఖ వైరల్..
చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ ఐటీ ఉద్యోగులు పార్కుల ఎదుట, రోడ్లపై ఆందోళనలు చేయడం కాకుండా సొంత గ్రామాలకు వెళ్లాలని బండ్ల గణేష్ సూచించారు. అక్కడి బోడ్రాయి ఎదుట కూర్చొని ధర్నాలు చేయాలని అన్నారు. చీము నెత్తురు ఉంటే నెల రోజుల పాటు ఉద్యోగాలు మానేయాలని, సొంత ఊర్లకు వెళ్లి ఆందోళనలు చేయాలని పిలుపునిచ్చారు. చంపేస్తే.. చంపేయాలని చెప్పాలని సూచించారు. టీడీపీ అధినేత రాజమండ్రి జైలులో ఉన్నారని, దీంతో తనకు అన్నం కూడా తినాలని అనిపించడం లేదని బండ్ల గణేష్ అన్నారు. చంద్రబాబు నాయుడు కచ్చితంగా వచ్చే ఎన్నికల్లో గెలుస్తారని బండ్ల గణేష్ ధీమా వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి అవుతారని తెలిపారు.