ఏపిలో పిడుగుపాట్లకు ఐదుగురు మృతి

First Published May 31, 2018, 6:18 PM IST
Highlights

ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తు నివారణ శాఖ హెచ్చరిక

ఏపిని అకాల వర్షాలతో పాటు పిడుగుపాట్లు అతలాకుతలం చేస్తున్నాయి. పలు జిల్లాలో భారీ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తోంది. దీంతో పిడుగుల దాటికి రాష్ట్రవ్యాప్తంగా ఐదుగురు మృతి చెందారు.

తూర్పుగోదావరి జిల్లా కరప మండలం వాకాడ గ్రామంలో పిడుగుపాటుకు గురై ఓ వ్యక్తి మృతి చెందాడు. అలాగే గుంటూరు జిల్లా నరసరావుపేట మండలం కొండకావూరు దగ్గర పిడుగుపాటుకు మరో ఇద్దరు మృతి చెందారు. ఇదే మండలం దొండపాడులో పిడుగుపాటుకు పశువుల కాపరి చినపరెడ్డి శివారెడ్డి మృతి చెందారు. ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలం గురిజేపల్లిలో మరో వ్యక్తి మృతి చెందాడు. 

ఇక పలు జిల్లాల్లో ఇలాగే ఉరుములతో కూడిన వర్షం కురుస్తోంది. దీంతో పిడుగులు పడే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తు నివారణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలకు ఈ ప్రమాదం ఎక్కువగా ఉందని హెచ్చరిందింది. కాబట్టి ఈ జిల్లాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. నందిగామ, ఇబ్రహీంపట్నం, చందర్లపాడు, కంచికచర్ల.. సత్తెనపల్లె, ముప్పాల, నకరికల్లు, రాజుపాలెం, ఈపూరు, కనిగిరి, హెచ్‌ఎంపాడు,వెలిగండ్ల, కొనకనమిట్లకు పిడుగులు పడే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు.
 

click me!