పుల్లల కోసం వెళ్లి ఐదుగురు పిల్లలు గల్లంతు... మున్నేరు పరిసర ప్రాంతాల్లో విషాదం...

By SumaBala BukkaFirst Published Jan 11, 2022, 7:06 AM IST
Highlights

పిల్లల బట్టలు, వారి సైకిళ్ళు ఏటి ఒడ్డున ఉండటంతో ఆ పరిసర ప్రాంతాల్లో ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. గ్రామస్థులు సైతం పరిసర ప్రాంతాల్లో పిల్లల కోసం గాలిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. రాత్రయినా ఆచూకీ తెలియకపోవడంతో  తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. 

కృష్ణాజిల్లా :  chandarlapadu మండలం ఏలూరు గ్రామం వద్ద munneru surroundingsల్లో ఐదుగురు పిల్లలు missing అయ్యారు. గ్రామానికి చెందిన 8 నుంచి 13 ఏళ్ల మధ్య వయసు కలిగిన ఐదుగురి పిల్లలు మధ్యాహ్నం సమయంలో ఇంటి నుంచి మున్నేరు వైపు వెళ్లారు. రాత్రి అవుతున్నా పిల్లలు ఇంటికి రాకపోవడంతో ఆందోళనతో ఉన్న తల్లిదండ్రులు వారి ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు.  

పిల్లల బట్టలు, వారి సైకిళ్ళు ఏటి ఒడ్డున ఉండటంతో ఆ పరిసర ప్రాంతాల్లో ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. గ్రామస్థులు సైతం పరిసర ప్రాంతాల్లో పిల్లల కోసం గాలిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. రాత్రయినా ఆచూకీ తెలియకపోవడంతో  తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. 

తప్పిపోయిన పిల్లలు.. మాగులూరు సన్నీ (12),  మైల రాకేష్ (11), కర్ల బాల యేసు (12), అజయ్ (12), గురజాల చరణ్ (14)లు స్థానిక ప్రభుత్వ పాఠశాలలో 6, 7, 9 తరగతులు చదువుతున్నారు. సంక్రాంతి సెలవులు కావడంతో వీరంతా ఇంటి దగ్గరే ఉన్నారు. సోమవారం ఉదయం వీరు వంటకు పుల్లలు తీసుకొద్దామని సైకిళ్లపై బయలుదేరారు. సాయంత్రమైనా ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు ఆరాతీశారు. పిల్లలు మున్నేరు దగ్గరికి వెళ్లినట్లు పశువుల కాపరులు సమాచారం ఇచ్చారు.

దీంతో తల్లిదండ్రులు మున్నేరు దగ్గర, దాని చుట్టుపక్కల ఎంత వెతికినా కనిపించకపోవడంతో ఆందోళ చెందారు. వెంటనే తల్లిదండ్రులు పోలీసులకు తెలిపారు.నందిగామ రూరల్ సీఐ నాగేంద్రకుమార్, చందర్లపాడు ఎస్ ఐ రామకృష్ణ,  తహసిల్దార్ సుశీలాదేవి  గాలింపు చర్యలు చేపట్టారు. విషయం తెలిసిన గ్రామస్తులు ఒక్కరొక్కరుగా అక్కడికి చేరుకున్నారు.

పల్లెకారులు, గజ ఈతగాళ్లు,  గ్రామస్తులు నదిలో పడవల సహాయంతో రాత్రివేళ వెతుకులాట ప్రారంభించారు.  నందిగామ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహనరావు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. పరిసర ప్రాంతాల్లో తీవ్రంగా గాలిస్తున్నారు .రాత్రి కావడంతో చీకట్లో వెతుకులాటకు ఇబ్బంది అవుతుంది. ముక్కుపచ్చలారని  చిన్నారులు మునేరులో గల్లంతవడంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. తల్లిదండ్రుల రోదనలతో ఆ ప్రాంతం శోక సంద్రంలో మునిగిపోయింది.  

నిరుడు డిసెంబర్ లో మూడేళ్ల వయసులో తప్పిపోయిన బాలుడు 14 ఏళ్ల తర్వాత మళ్లీ తల్లిదండ్రుల చెంతకు చేరాడు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ చిత్తూరులో చోటుచేసుకుంది. మూడేళ్ల వయసులో ఇంటి ముందు ఆడుకుంటూ బాలుడు తప్పిపోయాడు. అప్పుడే పోలీసులకు ఫిర్యాదు అందింది. తాజాగా, మరో ఊరిలో 14 ఏళ్ల నుంచి ఓ బాలుడిని పెంచుకుంటున్నారని తెలియడంతో పోలీసులు ఆరా తీశారు.

చిత్తూరు జిల్లా మదనపల్లె పట్టణం నీరుగట్టవారిపల్లెకు చెందిన శంకర్, రెడ్డెమ్మ దంపతులు, వారిద్దరికి ఆకాశ్ అనే కొడుకు ఉన్నాడు. ఆకాశ్ మూడేళ్ల వయసులో ఇంటి బయట ఆడుకుంటూ.. కనిపించకుండా పోయాడు. చుట్టు పక్కల ప్రాంతాల్లో గాలించాడు. పిల్లాడి ఆచూకి దొరకలేదు. దీంతో చేసేదేమీ లేక పోలీసులనూ ఆశ్రయించారు. టూటౌన్ పోలీసు స్టేషన్‌లో తమ కొడుకు కనిపించకుండా పోయాడని ఫిర్యాదు చేశారు. పోలీసులూ అప్పటి నుంచి బాలుడి కోసం గాలింపులు జరుపుతూనే ఉన్నారు.

మదనపల్లె మండలం రామాపురానికి చెందిన దంపతులు వెంకటరమణ, లలితలు సుమారు 14 ఏళ్ల నుంచి ఓ బాలుడిని పెంచుకుంటున్నట్టు సీఐ నరసింహులుకు సమాచారం వచ్చింది. దీంతో ఎస్ఐ నరసింహులు.. వెంకటరమణ, లలితలను బాలుడి గురించి విచారించారు. 2008లో నీరుగట్టువారి పల్లెలో తమకు ఈ బాలుడు లభించినట్టు పోలీసుల ముందు అంగీకరించారు. 

click me!