విశాఖపట్టణం పాలిషింగ్ కంపెనీలో ఐదు వజ్రాలు మాయం: కేసు నమోదు

Published : Oct 07, 2020, 11:37 AM IST
విశాఖపట్టణం పాలిషింగ్ కంపెనీలో ఐదు వజ్రాలు మాయం: కేసు నమోదు

సారాంశం

విశాఖపట్టణంలోని దువ్వాడ వీఎస్ఈజడ్ లో ఐదు వజ్రాలు మాయమయ్యాయి. వీటి విలువ సుమారు 7.5 లక్షలు ఉంటుందని అంచనా. ఈ విషయమై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.


హైదరాబాద్: విశాఖపట్టణంలోని దువ్వాడ వీఎస్ఈజడ్ లో ఐదు వజ్రాలు మాయమయ్యాయి. వీటి విలువ సుమారు 7.5 లక్షలు ఉంటుందని అంచనా. ఈ విషయమై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

విశాఖపట్టణంలోని డైమండ్ పాలిషింగ్ కంపెనీలో ఐదు సింథటిక్ వజ్రాలు మాయం కావడం కలకలం రేపుతోంది. ఈ విషయమై కంపెనీ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కంపెనీ నుండి వజ్రాలు మాయం కావడంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. 

కంపెనీ నుండి వజ్రాలు ఎప్పుడు మాయమయ్యాయి.. ఎవరు తీసుకెళ్లారనే విషయమై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ విషయమై ఇప్పటికే ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

Rain Alert : రుతుపవనాలు వచ్చేస్తున్నాయి... తెలుగు రాష్ట్రాల్లో జోరువానలు
Bullet Train: హైదరాబాద్ టు అమరావతి కేవలం 70 నిమిషాలే ! బుల్లెట్ ట్రైన్ రూట్ మ్యాప్ ఇదే !