ప్రకాశం జిల్లాలో రోడ్డు ప్రమాదం: ఐదుగురు మృతి

Published : Aug 09, 2019, 05:07 PM IST
ప్రకాశం జిల్లాలో రోడ్డు ప్రమాదం: ఐదుగురు మృతి

సారాంశం

తిరుపతికి కారులో వెళ్తున్న ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు లారీని కారు ఢీకోట్టడంతో ఈ ఘటన చోటు చేసుకొంది. ప్రకాశం జిల్లా మోచర్ల వద్ద ఈ ప్రమాదం జరిగింది.

ఒంగోలు: ప్రకాశం జిల్లా మోచర్ల వద్ద శుక్రవారం నాడు జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. మరోకరు తీవ్రంగా గాయపడ్డారు. మృతులంతా కరీంనగర్ జిల్లాకు చెందినవారుగా పోలీసులు గుర్తించారు.

కరీంనగర్ జిల్లాకు చెందినవారు తిరుపతికి కారులో వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకొంది. ఆగి ఉన్న లారీని కారు వెనుక నుండి ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. కారులో ఉన్న చిన్నారిని కావలి ఆసుపత్రికి తరలించారు. ఈ చిన్నారి చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది.

ఈ కారులో ఇద్దరు పురుషులు, ఇద్దరు మహిళలు ఇద్దరు చిన్నారులు ఉన్నారు. ఒక చిన్నారి మినహా కారులో ఐదుగురు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు.


 

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్