జగ్గయ్యపేట వేదాద్రి వద్ద రోడ్డు ప్రమాదం:12కు చేరుకున్న మృతుల సంఖ్య

Published : Jun 17, 2020, 02:22 PM ISTUpdated : Jun 17, 2020, 05:33 PM IST
జగ్గయ్యపేట వేదాద్రి వద్ద రోడ్డు ప్రమాదం:12కు చేరుకున్న మృతుల సంఖ్య

సారాంశం

జగ్గయ్యపేట మండలం వేదాద్రి వద్ద బుధవారం నాడు ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకొంది. ట్రాక్టర్, లారీ ఢీకొన్న ప్రమాదంలో పది మంది మరణించారు. పలువురు ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డారు.

జగ్గయ్యపేట మండలం వేదాద్రి వద్ద బుధవారం నాడు ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకొంది. ట్రాక్టర్, లారీ ఢీకొన్న ప్రమాదంలో మృతుల సంఖ్య 12 కు చేరుకుంది. 

ట్రాక్టర్ ను ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో ఏడుగురఅక్కడికక్కడే మృతి చెందారు.  ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో ముగ్గురు మరణించారు. ఇంకా 14 మంది ఆసుపత్రిలో చికిత్సపొందుతున్నారు ప్రమాదం జరిగిన సమయంలో ట్రాక్టర్‌లో 30 మంది ఉన్నారు. గాయపడినవారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

ఖమ్మం జిల్లా మధిర మండలం గోపవరం నుండి దైవదర్శనానికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకొంది.అతి వేగంగా వస్తున్న లారీ ట్రాక్టర్ ను ఢీ కొట్టింది. దీంతో ఏడుగురు అక్కడిక్కడే మరణించారని ప్రత్యక్షసాక్షులు తెలిపారు. 

దైవ దర్శనం చేసుకొని తిరిగి వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకొంది.మరణించిన వారంతా తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని మధిర మండలం గోపవరం గ్రామస్తులుగా చెబుతున్నారు.  క్షతగాత్రులను స్థానికులు, పోలీసులు ఆసుపత్రికి తరలించారు. మరణించిన వారిలో ఇద్దరు చిన్నారులు కూడ ఉన్నారు. 

కేసీఆర్ సంతాపం

జగ్గయ్యపేట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో  పది మంది మరణిించడంపై తెలంగాణ సీఎం కేసీఆర్ దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో మరణించిన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. మృతుల కుటుంబాలకు, గాయపడిన కుటుంబాలను ఆదుకోవాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. 

PREV
click me!

Recommended Stories

Hello Lokesh Interaction: హలో లోకేష్ కార్యక్రమంలోవిద్యార్థులతో లోకేష్ పంచ్ లు | Asianet News Telugu
Minister Nara Lokesh: మంత్రి లోకేష్ నే ర్యాగింగ్ చేసిన విద్యార్థి అందరూ షాక్| Asianet Telugu