ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రికార్డు స్థాయిలో కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. ఏపీలో మొత్తం కరోనా వైరస్ కేసుల సంఖ్య 7 వేలు దాటింది. మరణాలు 90 సంభవించాయి.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నానాటికీ కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. మరణాలు కూడా ఆగడం లేదు. ఏపీలో కరోనా వైరస్ కేసులు 7 వేలు దాటాయి. కోవిడ్ -19 మరణాలు 90కి చేరుకున్నాయి. గత 24 గంటల్లో 351 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా వైరస్ కేసుల సంఖ్య 7071కి చేరుకుంది.
తాజాగా గత 24 గంటల్లో మరో రెండు మరణాలు సంభవించాయి. దీంతో ఏపీలో మొత్తం మరణాల సంఖ్య 90కి చేరుకుంది. తాజాగా నమోదైన కేసుల్లో 275 రాష్ట్రానికి చెందినవి కాగా, ఇతర ప్రాంతాల నుంచి వచ్చినవారిలో 76 మందికి కరోనా వైరస్ పాజిటివ్ నిర్ధారణ అయింది.
undefined
మొత్తం 15,188 శాంపిల్స్ ను పరీక్షించగా రాష్ట్రానికి చెందినవారిలో 275 మందికి కరోనా వైరస్ పాజిటివ్ వచ్చింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖ బుధవారం బులిటెన్ విడుదల చేసింది. తాజాగా గత 24 గంటల్లోో కర్నూలు జిల్లాలో ఒకరు, గుంటూరు జిల్లాలో మరొకరు మరణించారు.
గత 24 గంటల్లో 55 మంది కరోనా వైరస్ నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జీ అయ్యారు. రాష్ట్రంలో నమోదైన మొత్తం 5555 పాజిటివ్ కేసుల్లో 2906 మంది కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జీ అయ్యారు. ప్రస్తుతం 2559 మంది చికిత్స పొందుతున్నారు.
విదేశాల నుంచి వచ్చినవారిలో 263 మందికి కరోనా వైరస్ నిర్ధారణ కాగా, గత 24 గంటల్లో వ్యాధి నుంచి కోలుకుని 21 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జీ అయ్యారు. యాక్టివ్ కేసులు 219 ఉన్నాయి.
ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారిలో 1253 మందికి కరోనా వైరస్ పాజిటివ్ నిర్ధారణ కాగా ఈ రోజు 52 మంది కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జీ అయ్యారు. యాక్టివ్ కేసులు 562 ఉన్నాయి.
: 17/06/2020, 10:00 AM
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 5555 పాజిటివ్ కేసు లకు గాను
*2906 మంది డిశ్చార్జ్ కాగా
*90 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 2559 pic.twitter.com/332lccs1HO