మండలిలో మూడు రాజధానుల బిల్లును అడ్డుకునేందుకు టీడీపీ త్రిముఖ వ్యూహం, ఫలించేనా...?

By Sreeharsha GopaganiFirst Published Jun 17, 2020, 2:22 PM IST
Highlights

సీఆర్డీఏ రద్దు బిల్లు, పాలనావికేంద్రీకరణ బిల్లులు నేడు మండలి ముందుకు వస్తున్న నేపథ్యంలో టీడీపీ తమ అన్ని ఆయుధాలను సిద్ధం చేసుకుంటుంది. ఇప్పటికే బిల్లును ఎలా అడ్డుకుంటామో చూడండి అని చంద్రబాబు సవాల్ చేసిన విషయం తెలిసిందే. 

సీఆర్డీఏ రద్దు బిల్లు, పాలనావికేంద్రీకరణ బిల్లులు నేడు మండలి ముందుకు వస్తున్న నేపథ్యంలో టీడీపీ తమ అన్ని ఆయుధాలను సిద్ధం చేసుకుంటుంది. ఇప్పటికే బిల్లును ఎలా అడ్డుకుంటామో చూడండి అని చంద్రబాబు సవాల్ చేసిన విషయం తెలిసిందే. 

మండలిలో టీడీపీ నేత యనమల రామకృష్ణుడు సైతం ఇదే విషయాన్ని చెప్పారు. అందుకు తగ్గ కస్సరత్తుల్లో నిమగ్నమైంది. టీడీపీ ఎమ్మెల్సీలతో ఆ పార్టీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు భేటీ అయ్యారు. రూల్ 90 కింద అవసరమైతే ఓటింగుకు టీడీపీ పట్టుబట్టే అవకాశం కూడా ఉన్నట్టు తెలియవస్తుంది. 

తమ పార్టీ సభ్యులంతా పార్టీ నిర్ణయానికి అనుగుణంగా వ్యవహరిస్తారని టీడీపీ ధీమా వ్యక్తం చేస్తున్నప్పటికీ... వైసీపీ మైండ్ గేమ్ ఎమన్నా ఆడుతుందా అని కూడా ఆందోళన చెందుతున్నారు. 

తమ పార్టీకి 28 మంది ఎమ్మెల్సీల బలం ఉందని టీడీపీ చెబుతోంది. తాను వైసీపీలో చేరుతాను అనిచెప్పి పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్న కేఈ ప్రభాకర్‌తో టీడీపీ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మాట్లాడారు. 

ఆయనతో చర్చలు సఫలంగా ముగిశాయని తెలియవస్తుంది. చిన్న చిన్న మనస్పర్థలే తప్ప పెద్ద సమస్యలేవీ లేవని ఆయన అన్నట్టుగా టీడీపీ వర్గాలు తెలుపుతున్నాయి. 

ఇకపోతే... టీడీపీ ఎమ్మెల్సీలు శమంతకమణి, పోతుల సునీత, శివనాధ్ రెడ్డిలకు టీడీపీ మండలి విప్ బుద్ధా వెంకన్న ఇప్పటికే విప్ జారీ చేసిన విషయం తెలిసిందే. 

షెడ్యూల్ సమయం కంటే 11 నిమిషాలు ఆలస్యంగా ఏపీ శాసనమండలి ప్రారంభమైంది.  శాసనమండలి సమావేశం ప్రారంభం కాగానే సీఆర్‌డీఏ రద్దు బిల్లు, ఏపీ పాలనా వికేంద్రీకరణ బిల్లులు  మండలి ముందుకు వచ్చినట్టుగా మండలి ఛైర్మెన్ ఎంఏ షరీఫ్ ప్రకటించారు.

also read:శాసనమండలికి సీఆర్‌డీఏ రద్దు, పాలనా వికేంద్రీకరణ బిల్లులు: అడ్డుకొనేందుకు టీడీపీ వ్యూహం, ఏం జరుగుతోంది?

ఈ రెండు బిల్లులను సెలెక్ట్ కమిటికి పంపాలని గతంలోనే మండలి తీర్మానం చేసిన విషయాన్ని టీడీపీ సభ్యులు ప్రకటించారు. వికేంద్రీకరణ బిల్లులపై చర్చించకూడదని రూల్ 90 కింద టీడీపీ సభ్యులు శాసనమండలి ఛైర్మెన్ కు నోటీసులు ఇచ్చారు.

గతంలోనె ఈ రెండు బిల్లులను సెలెక్ట్ కమిటిని ఏర్పాటు చేసేలా ఆదేశాలు జారీ చేయాలని హైకోర్టులో టీడీపీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి పిటిషన్ దాఖలు చేసిన విషయాన్ని టీడీపీ సభ్యులు గుర్తు చేస్తున్నారు.197 నిబంధన కింద శాసనమండలిలో ఈ రెండు బిల్లులను ప్రవేశ పెట్టడం సరైంది కాదని టీడీపీ ఎమ్మెల్సీలు అభిప్రాయపడుతున్నారు.

click me!