స‌ముద్రంలో చిక్కుకున్న జాలర్లు సుర‌క్షితం.. వేట‌కు వెళ్ల‌కూడ‌ద‌ని హెచ్చ‌రిక‌లు

By Rajesh KFirst Published May 12, 2022, 11:07 PM IST
Highlights

krishna coast: కృష్ణా జిల్లా మచిలీపట్నం గిలకలదిండి నుండి అక్రమంగా అధికారుల క‌న్నుక‌ప్పి 8 మంది మత్స్యకారులు స‌ముద్రంలోకి వేట‌కు వెళ్లారు. అస‌ని తుఫాన్ కార‌ణంగా సముద్రంలో చిక్కుకున్న జాలర్లను సురక్షితంగా గురువారం మచిలీపట్నం హార్బర్ కి అధికారులు తీసుకువచ్చారు
 

Krishna Coast: అక్ర‌మంగా స‌ముద్రంలోకి వేట‌కు వెళ్లిన జాల‌ర్ల‌ను పోలీసులు సుర‌క్షితంగా బ‌య‌ట‌కు తీసుక‌వ‌చ్చారు.  కృష్ణా జిల్లా మచిలీపట్నం గిలకలదిండి నుండి 8 మంది మత్స్యకారులు ఫైబర్ బోటు ద్వారా దొంగచాటుగా సముద్రం లోనికి ప్రవేశించారు. అయితే.. అస‌ని తుఫాన్ కార‌ణంగా ఆ జాలర్లు సముద్రంలోనే చిక్కుకున్నారు. ఈ విష‌యం   అధికారులకు తెలిసింది. దీంతో అప్ర‌మ‌త్త‌మైన అధికారులు వారి ఆచూకీ కోసం స‌ముద్రంలో జల్లెడ పట్టారు. 5 రోజుల పాటు స‌ముద్రంలో చిక్కుకున్న వీరిని సురక్షితంగా గురువారం మచిలీపట్నం హార్బర్ కి అధికారులు తీసుకువచ్చారు

మత్స్య సంపదను రక్షించేందుకు ప్రభుత్వం ప్రతి సంవత్సరము ఏప్రిల్ 15 నుండి జూన్ 16 వరకు మత్స్యకారులు ఎవరు సముద్రంలోకి వేటకు వెళ్లకూడదని ఆంక్షలు ఉన్నాయి. కానీ  దొంగ చాటుగా సముద్రం లో వేట కొనసాగుతూనే ఉన్న మత్స్యకారులు తుఫాన్ ప్రభావంతో జాలర్లు వెళ్ళిన పడవ ఆచూకీ తెలియడం లేదని అధికారుల దృష్టికి రావడంతో  ఈ విషయం బయటకు వచ్చింది దీంతో మెరైన్ పోలీసులు జిపిఎస్ ద్వారా సముద్రంలో గాలింపు మొదలుపెట్టారు మాల కాయ లంక ప్రదేశములో వారిని గుర్తించి రెవిన్యూ, కోస్ట్ గార్డ్, మత్స్యశాఖ, పోలీస్ అధికారులు  మచిలీపట్నం గిలకలదిండి హార్బర్ కు తీసుకువచ్చారు.

ఈ సంఘటనపై జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ మాట్లాడుతూ  రెస్క్యూ ఆపరేషన్ ద్వారా వీరిని తీసుకువచ్చామని రహస్యంగా వేట చేయడం నేరమని వీరిపై ప్రభుత్వానికి నివేదిక పంపుతామని ఈ సంఘటనపై అధికారుల ఆలసత్వం ఉందని తెలిస్తే వారిపై కూడా చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ తెలిపారు. 

ఇదిలా ఉంటే.. అసాని తుఫాను నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. స‌ముద్రంలోకి వెళ్ల‌కూడ‌ద‌ని హెచ్చరించింది. తీర ప్రాంత మండలాల్లో సహాయక చర్యలు చేపట్టేందుకు కలెక్టరేట్‌లో 08672-252572, 99086 64635 నెంబర్లతో కంట్రోల్‌ రూమ్‌ను ఏర్పాటుచేశారు. మంగినపూడి బీచ్‌, హంసలదీవిలోని సాగర సంగమం తదితర ప్రాంతాల్లో సముద్రం వద్దకు ఎవరూ వెళ్లకుండా మెరైన్‌, పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ త‌రుణంలో ఎస్పీ సిద్ధార్థ కౌశల్‌, జేసీ మహేశ్‌కుమార్‌ రావిరాల, ఇతర పోలీసు శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. తీరం వెంబడి మండలాల తహసీల్దార్లను అప్రమత్తం చేశారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సర్వంసిద్ధం చేశామని  . కాగా, సముద్రంలోకి చేపల వేటకు వెళ్లొద్దని మత్స్యశాఖ అధికారులు హెచ్చరికలు జారీచేశారు.

\

 

click me!