జనంలోకి వెళ్లమన్నా .. ఇంకా కొందరు మొదలు పెట్టలేదు: కొత్త మంత్రులకు జగన్ క్లాస్

By Siva KodatiFirst Published May 12, 2022, 8:01 PM IST
Highlights

కేబినెట్ సమావేశం వేళ కొత్త మంత్రులకు సీఎం వైఎస్ జగన్ క్లాస్ తీసుకున్నారు. గడప గడపకు వైసీపీ కార్యక్రమాన్ని కొందరు మంత్రులు ఇంకా మొదలుపెట్టేలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. జనంలో వుంటే మీరే గెలుస్తారని జగన్ సూచించారు. 
 

ఆంధ్రప్రదేశ్ మంత్రి మండలి సమావేశం (ap cabinet meeting) సీఎం వైఎస్  జగన్ (ys jagan) అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. సమావేశం ముగిసిన తర్వాత సీఎం జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గడప గడపకూ (gadapa gadapaku ycp) మన ప్రభుత్వంపై చర్చ జరగాలని సీఎం పిలుపునిచ్చారు. జనంలో వుంటే మీరే గెలుస్తారని.. మంత్రులు తప్పనిసరిగా ప్రజల్లోకి వెళ్లాలని జగన్ సూచించారు. పథకాలు అందకుంటే వారికి ఓపికగ్గా వివరించాలని.. కొంతమంది మంత్రులు ఇంకా మొదలుపెట్టలేదంటూ వారిని సున్నితంగా హెచ్చరించారు. దేశంలో ఎక్కడా ఈ స్థాయిలో సంక్షేమ పథకాలు లేవని.. అర్హులకు పథకాలు అందకుంటే చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. 

మరోవైపు గడప గడపకు వైసీపీ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలకు జనం నుంచి నిరసన సెగలు వ్యక్తమవుతున్నాయి. ఈ  క్రమంలోనే మంత్రి గుమ్మనూరు జయరాంకు (gummanur jayaram) చేదు అనుభవం ఎదురైంది. మంత్రి బుధవారం కర్నూలు జిల్లా (kurnool district) అలూరు మండలం హాత్తిబెళగల్ గ్రామంలో గడప గడపకు కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే ఆయనను స్థానికులు అడ్డుకున్నారు. అమ్మ ఒడి లేకున్నా సరే.. రోడ్డు వేయించాలని మంత్రిని స్థానికులు నిలదీశారు. తమకు అమ్మఒడి రాలేదని చెప్పిన కొందరు మహిళలు.. అదిపోయినా తమకు రోడ్లు వేయించాలని కోరారు. అంతేకాకుండా మంత్రి ముందు పలు సమస్యలను ప్రస్తావించారు. త్రాగునీటి సమస్య పరిష్కరించాలని కోరారు. దీంతో మంత్రి వాటిని పరిశీలిస్తానని హామీ ఇచ్చారు. 

Also Read:అమ్మ ఒడి లేకున్నా సరే.. రోడ్డు వేయించండి: మంత్రి గుమ్మనూరు జయరాంకు నిరసన సెగ

ఇక, రానున్న ఎన్నికలను లక్ష్యంగా  పెట్టుకుని వైసీపీ అడుగులు వేస్తుంది. మంత్రులు, వైసీసీ ఎమ్మెల్యేలు ప్రజల్లోకి వెళ్లేలా సీఎం జగన్ ప్రణాళికలు రచించారు. నేటి నుంచి గడప గడపకు వైసీపీకి శ్రీకారం చుట్టారు. ప్రతి ఒక్క ఎమ్మెల్యే తప్పనిసరిగా సచివాలయాల కేంద్రంగా గడప గడపకు వెళ్లాలని పార్టీ అధినేత జగన్ ఆదేశాలు జారీ చేశారు. నెలలో కనీసం 10 సచివాలయాలను సందర్శించాలని చెప్పారు. దీంతో మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ పథకాల గురించి వివరించడమే కాకుండా.. అవి అందుతున్నాయా..? లేదా..? అని అడిగి తెలుసుకుంటున్నారు. అయితే కొన్నిచోట్ల మంత్రులు, ఎమ్మెల్యేలకు స్థానికుల నుంచి ప్రశ్నలు ఎదురవుతున్నాయి. 
 

click me!