నేటి ఉదయం ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా తొలి రైలు వలసకూలీలతో బయల్దేరింది. 1212 మంది ప్రయాణికులతో... మహారాష్ట్రలోని చంద్రాపూర్ కి ఈ శ్రామిక్ రైలు బయల్దేరి వెళ్ళింది.
కరోనా వైరస్ నేపథ్యంలో దేశంలో విధించిన లాక్ డౌన్ వల్ల ఎందరో ప్రజలు ఎక్కడెక్కడో చిక్కుబడిపోయారు. వారంతా నెల రోజులకుపైగా దేశంలోని వివిధ ప్రాంతాల్లో చిక్కుబడి తీవ్ర ఇబ్బందులను ఎదుర్కుంటున్నారు.
వీరి పరిస్థితి అర్థం చేసుకున్న కేంద్రం వలస కార్మికులను, చిక్కుబడిపోయిన వారిని వారి స్వస్థలాలకు తరలించేందుకు అనుమతులిచ్చింది. ఈ నేపథ్యంలో తెలంగాణ నుంచి తొలి ప్రత్యేక శ్రామిక్ రైలు ఝార్ఖండ్ కి బయల్దేరింది కూడా!
undefined
ఇక తాజాగా నేటి ఉదయం ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా తొలి రైలు వలసకూలీలతో బయల్దేరింది. 1212 మంది ప్రయాణికులతో... మహారాష్ట్రలోని చంద్రాపూర్ కి ఈ శ్రామిక్ రైలు బయల్దేరి వెళ్ళింది.
నేటి తెల్లవారుఝామున 3 గంటల ప్రాంతంలో ఈ రైలు బయల్దేరి వెళ్ళింది. ప్రయాణికుల మధ్య భౌతిక దూరాన్ని కొనసాగిస్తూ ప్రయాణికులను రైల్లో ఎక్కించి పంపించింది ఆంధ్రప్రదేశ్ సర్కార్.
భారతదేశంలో కరోనా వైరస్ విలయతాండం చేస్తూనే ఉంద. దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 46,433కు చేరింది. కాగా.. ఇప్పటి వరకు దేశంలో కరోనా కారణంగా 1,568మంది ప్రాణాలు కోల్పోయారు.
కాగా..ఇప్పటి వరకు 12,726 మంది కరోనా వైరస్ నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జీ అయ్యారు. దీంతో యాక్టివ్ కేసుల సంఖ్య 32,138 ఉంది. రికవరీ రేటు 27.52 శాతం ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్ తెలిపింది.
కాగా.. ఈ వైరస్ కేసులు రోజు రోజుకీ పెరిగిపోవడంతో దేశంలో లాక్ డౌన్ కొనసాగిస్తున్నారు. మే 17వ తేదీ వరకు కేంద్ర ప్రభుత్వం దేశంలో లాక్ డౌన్ విధించింది. ఆ తర్వాత కూడా లాక్ డౌన్ కొనసాగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కనీసం కేసులు అదుపులోకి వస్తే లాక్ డౌన్ ని కాస్త సడలించే అవకాశం ఉంది.
కాగా.. ఇప్పటికే కేసులు ఎక్కువగా ఉన్న ప్రాంతాలను రెడ్ జోన్లుగానే, కాస్త తక్కువగా ఉన్న ప్రాంతాలను ఆరెంజ్ జోన్లుగా.. అసలు లేని ప్రాంతాలను గ్రీన్ జోన్లుగా ప్రకటించారు.