మద్యం అమ్మకాల తొలిరోజే విషాదం... మత్తులో ప్రయాణం, ప్రాణాలు కోల్పోయిన వ్యక్తి

By Arun Kumar P  |  First Published May 5, 2020, 10:40 AM IST

ఆంధ్ర ప్రదేశ్ లో లాక్ డౌన్ ను సడలిస్తూ మద్యం అమ్మకాలను మొదలుపెట్టిన రోజే కృష్ణా జిల్లాలో విషాద సంఘటన చోటుచేసుకుంది.  


అమరావతి: లాక్ డౌన్ విధించినప్పటి నుండి మూతపడ్డ వైన్ షాపులు ఏపిలో నిన్న(సోమవారం) తెరుచుకున్న విషయం తెలిసిందే. చాలారోజుల తర్వాత మందు లభించడంతో మద్యం ప్రియులు వైన్ షాపుల వద్ద కిలోమీటర్ల మేర లైన్లలో నిలబడి  మరీ మందు తీసుకున్నారు. ఇలా మద్యాన్ని తీసుకుని ఫీకలదాక తాగిన ఓ వ్యక్తి ప్రమాదానికి గురయి మృత్యువాతపడిన విషాద సంఘటన కృష్ణా జిల్లాలో చోటుచేసుకుంది. 

జిల్లాలోని మైలవరం గ్రామానికి చెందిన ఎరువు చంద్రశేఖర్ రెడ్డి(40) నిన్న మద్యంసేవించి దగ్గర్లోని జి.కొండూరుకు బైక్ పై బయలుదేరాడు. అయితే మద్యంమత్తుల్లో ప్రయాణిస్తున్న అతడిని  వెంకటాపురం గ్రామ శివారులో గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో  ఎగిరి రోడ్డుపక్కన పడిపోయి అక్కడికక్కడే మృతిచెందాడు. 

Latest Videos

ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుడి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు.  అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.   
 

click me!