చంద్రబాబుకు షాక్: కరోనాపై జగన్ మాటకు ఎదురులేని మద్దతు

By telugu teamFirst Published May 5, 2020, 9:54 AM IST
Highlights

కరోనా మీద ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైెఎస్ జగన్ మాటకే బలం చేకూరుతోంది. కరోనా విషయంలో కేజ్రీవాల్, కేటీఆర్ వంటి నేతలు కూడా జగన్ వ్యక్తం చేసిన అభిప్రాయాన్నే వ్యక్తం చేశారు.

అమరావతి: కరోనా వైరస్ మీద ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలపై తెలుగుదేశం పార్టీ నాయకులు తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. కరోనా వైరస్ తో సహజీవనం చేయాల్సిందేనని వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యను ఆసరా తీసుకుని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడితో సహా పలువురు నేతలు విమర్శలు గుప్పించారు. 

వైఎస్ జగన్ చెప్పిన విషయాన్నే దేశంలోని పలువురు నాయకులు చెబుతున్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అదే విషయం చెప్పారు. తాజాగా, తెలంగాణ ఐటి శాఖ మంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు ఆ విషయం చెప్పారు. 

కరోనాను రూపుమాపడం అసాధ్యమనేది ఇప్పుడు సర్వత్రా వినిపిస్తున్న మాట. తగు జాగ్రత్తలు తీసుకుంటూ పనులు చేసుకుంటూ పోవడం ఒక్కటే మార్గమని భావిస్తున్నారు. లాక్ డౌన్ ను కూడా ఇంకా ఎంతో కాలం కొనసాగించలేని పరిస్థితి. కరోనా వైరస్ సమాజంలో బతికే ఉంటుంది. దాన్ని దూరంగా ఉంచడానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలనేది జగన్ మాటలోని ఆంతర్యం.

వైఎస్ జగన్ మాటలపై బుద్ధా వెంకన్న వంటి టీడీపీ నేతలు తీవ్రంగా విరుచుకుపడ్డారు. జగన్ కు కరోనా వ్యాప్తిని కట్టడి చేయడం సాధ్యం కావడం లేదని, వైసీపీ నేతల వల్లనే కరోనా వైరస్ వ్యాపిస్తోందని టీడీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు, ఢిల్లీ, మహారాష్ట్రల్లో కూడా కరోనా వైరస్ వ్యాప్తి జరుగుతోంది. రోజు రోజుకూ కేసులు పెరుగుతున్నాయి. 

click me!