రేపే ఫస్ట్ ఫేజ్ పంచాయితీల్లో పోలింగ్... ఏర్పాట్లివే: పంచాయితీరాజ్ ప్రిన్సిపల్ సెక్రెటరీ ద్వివేది

By Arun Kumar PFirst Published Feb 8, 2021, 5:02 PM IST
Highlights

మొదటి విడతలో 3249 సర్పంచ్ లకు, 32,502 వార్డు మెంబర్ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయని... 525 సర్పంచులు. 12,185 వార్డు మెంబర్లు ఏకగ్రీవమయ్యాయని ద్వివేది తెలిపారు. 
 

అమరావతి: పంచాయతీలకు మొదటి ఫేజ్ ఎన్నికలకు ఏర్పాట్లు చేసామని పంచాయితీరాజ్ ప్రిన్సిపల్ సెక్రెటరీ గోపాలకృష్ణ ద్వివేది వెల్లడించారు. ఈ మొదటి విడతలో 3249 సర్పంచ్ లకు, 32,502 వార్డు మెంబర్ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయని... 525 సర్పంచులు. 12,185 వార్డు మెంబర్లు ఏకగ్రీవమయ్యాయని ద్వివేది తెలిపారు. 

ఎన్నికల కోసం 29,732 పొలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయగా అందులో 3458 సెన్సిటివ్, 3594 హైపర్ సెన్సిటివ్ పోలింగ్ స్టేషన్లు తెలిపారు. పెద్ద బ్యాలెట్ బాక్సులు 18,608.. మధ్యరకం బ్యాలెట్ బాక్సులు 8503.. చిన్న బ్యాలెట్ బాక్సులు 21338 సిద్దం చేసినట్లు వెల్లడించారు. స్టేజ్ - 1 ఆర్ఓ లు 1130, స్టేజ్ - 2 ఆర్ఓలు 3249, ఏఆర్ఓ లు 1432, పీఓ లు 33,533, ఇతర పోలింగ్ సిబ్బంది 44, 392, జోనల్ అధికారులు 519, రూట్ అధికారులు 1121, మైక్రో అబ్జర్వర్లు 3046 ఎన్నికల విధుల్లో వుండనున్నట్లు తెలిపారు.

read more    పంచాయితీ ఏకగ్రీవాలపై ఎస్ఈసీ నిఘా... సాయంత్రానికి కీలక ప్రకటన?

215 డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల నుంచీ బ్యాలెట్ బాక్సులు పంపిణీ చేయనున్నామని వెల్లడించారు. 5కిమీల కంటే ఎక్కువ దూరం ఉన్న స్టేషన్లకు 2216 పెద్ద వాహనాలు, 5కిమీల కంటే తక్కువ దూరం ఉన్న స్టేషన్ కు 1412 వాహనాలను ఏర్పాటు చేసినట్లు ద్వివేది తెలిపారు.  

పోలింగ్ సందర్భంగా ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద కోవిడ్ జాగ్రత్తలు తీసుకున్నామన్నారు. కోవిడ్ బాధితులు ఓటర్లుగా ఉంటే వారు పోలింగ్ చివరి గంటలో ఓటు వేసే అవకాశం కల్పించామన్నారు. ఇక కౌంటింగ్ కోసం 14,535 సూపర్వైజర్లు, 37,750 సిబ్బంది పని చేస్తారన్నారు. కౌంటింగ్ పోలింగ్ స్టేషన్ లోనే పూర్తవ్వాలన్నారు. ఎన్నికల్లో నోటా గుర్తు ఉంటుందని... ఖచ్చితంగా ఓట్ల లెక్కింపులో నోటాను గుర్తిస్తామన్నారు.  పశ్చిమగోదావరి లో బొప్పనపల్లి, వడ్డిగూడెంలకు రెండవ ఫేజ్ లో పోలింగ్ జరగనున్నట్లు ద్వివేది వెల్లడించారు. 

click me!