వేతనాలు పెంచాలని వలంటీర్ల ధర్నా: విజయవాడ కార్పోరేషన్ వద్ద ఉద్రిక్తత

By narsimha lodeFirst Published Feb 8, 2021, 4:17 PM IST
Highlights

వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ విజయవాడ కార్పోరేషన్ వద్ద వలంటీర్లు ఆందోళనకు దిగారు. దీంతో  ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
 

విజయవాడ:వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ విజయవాడ కార్పోరేషన్ వద్ద వలంటీర్లు ఆందోళనకు దిగారు. దీంతో  ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

జీతాలు పెంచాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా వలంటీర్లు సోమవారం నాడు  ఆందోళనలు నిర్వహిస్తున్నారు.  ఇటీవల కాలంలో ఇంటింటికి రేషన్ పంపిణీ చేసే కార్యక్రమంలో పాల్గొన్నవారికి తమ కంటే ఎక్కువ వేతనం ఇస్తున్నారని వలంటీర్లు చెబుతున్నారు.

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల వద్దకు తాము తీసుకెళ్తున్నామని వలంటీర్లు చెబుతున్నారు. కానీ తమకు సరైన వేతనం అందడం లేదని వలంటీర్లు చెబుతున్నారు.

ఆందోళనలు నిర్వహిస్తున్న  వలంటీర్లను పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. ఆందోళన చేస్తున్న పోలీసులను అదుపులోకి తీసుకొనేందుకు వచ్చిన పోలీసులతో వలంటీర్లు వాగ్వాదానికి దిగారు. పోలీసులకు  వలంటీర్ల మధ్య తోపులాట చోటు చేసుకొందన్నారు.

రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజలకు తాము వారధిగా ఉన్నామని.. అలంటి తమకు చాలీ చాలని వేతనాలు అందుతున్నాయని వలంటీర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అడగని వారికి కూడ వేతనాలు పెంచుతున్న సీఎం జగన్... తాము వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తున్న ఎందుకు వేతనాలు పెంచడం లేదో చెప్పాలని వలంటీర్లను ప్రశ్నించారు. 

click me!