అంబేద్కర్ కోనసీమ జిల్లాలో గ్యాస్ లీక్, భారీగా మంటలు: భయాందోళనలో స్థానికులు

By narsimha lode  |  First Published Jul 25, 2023, 5:00 PM IST

అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని రాఘవులుపేటలో  ఓఎన్‌జీసీ గ్యాస్ లీకైంది. దీంతో భారీగా మంటలు వ్యాపించాయి.   స్థానికులు అధికారులకు  సమాచారం ఇచ్చారు.


కాకినాడ: అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని  రాఘవులుపేటలో  ఓఎన్‌జీసీ గ్యాస్ లీకైంది.  ఈ గ్యాస్ లీక్ తో  మంటలు వ్యాపించాయి. దీంతో  స్థానికులు  ఓఎన్‌జీసీ అధికారులకు సమాచారం ఇచ్చారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఓఎన్‌జీసీ గ్యాస్ పైప్ లైన్ లీకై  పలు  ప్రమాదాలు చోటు చేసుకున్నాయి.  2005లో తూర్పుగోదావరి జిల్లాలోని తాటిపాకలో  ఓఎన్‌జీసీ బావిలో  పేలుడు చోటు  చేసుకుంది. 2010 తాటిపాక వద్ద రెండు సార్లు గ్యాస్ పైపులైన్లు లీకేజీకి గురయ్యాయి. 

Latest Videos

undefined

2014  జూన్  28న అమలాపురానికి సమీపంలోని నాగారం వద్ద  గ్యాస్ లీకై అగ్ని ప్రమాదం  జరిగింది.  ఈ ఘటనలో  15 మంది  సజీవ దహనమయ్యారు. మరో 15 మంది గాయపడ్డారు.2020 మే 18న  మలికిపురం  మండలం తూర్పుపాలెం వద్ద గ్యాస్ లీకైంది.అదే ఏడాది జూలై  10న  తూర్పుగోదావరి జిల్లాలో  ఓఎన్‌జీసీలో  ప్రమాదం జరిగింది.2021  ఏప్రిల్ మాసంలో  ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం  మండలం  సీతారామపురం  వద్ద ఓఎన్‌జీసీ గ్యాస్ పైప్ లైన్ లీకైంది2022   సెప్టెంబర్  27న  అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని పాశర్లపూడి వద్ద  ఓఎన్‌జీసీ గ్యాస్ లీకైంది.

ఈ ఏడాది జూన్  16న తూర్పుపాలెం  వద్ద ఓఎన్‌జీసీ గ్యాస్ పైప్ లైన్ లీకైంది. దీంతో మంటలు వ్యాపించాయి.  ఈ విషయం తెలుసుకున్న  ఓఎన్‌జీసీ అధికారులు   నాలుగు ఫైరింజన్లతో మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ మంటలతో భయాందోళనలకు గురయ్యారు తూర్పుపాలెం వాసులు. మంటలను ఆర్పిన  తర్వాత  స్థానికులు ఇళ్లకు చేరుకున్నారు. తాజాగా మరోసారి  ఓఎన్‌జీసీ గ్యాస్ పైప్ లైన్ లీక్ కావడం  ప్రస్తుతం కలకలం రేపుతుంది.
 

click me!