విశాఖ స్టీల్ ప్లాంట్ లో అగ్నిప్రమాదం..రెండు కోట్ల ఆస్తి నష్టం...

Published : Nov 05, 2020, 11:22 AM IST
విశాఖ స్టీల్ ప్లాంట్ లో అగ్నిప్రమాదం..రెండు కోట్ల ఆస్తి నష్టం...

సారాంశం

విశాఖలో మరో అగ్నిప్రమాదం కలకలం రేపింది. గత కొద్ది రోజులుగా విషవాయువుల లీకేజ్, వరదలతో అల్లాడుతున్న ప్రజలకు ఈ అగ్నిప్రమాదం భయాందోళనల్లో ముంచేసింది.

లీకేజ్, వరదలతో అల్లాడుతున్న ప్రజలకు ఈ అగ్నిప్రమాదం భయాందోళనల్లో ముంచేసింది.

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. టర్బన్‌ ఆయిల్‌ లీక్‌ కావడంతో స్టీల్‌ప్లాంట్‌ టీపీపీ-2లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో  ప్లాంట్‌లోని 1.2 మెగావాట్ల విద్యుత్‌ మోటర్లు దగ్ధం కావడంతో సుమారు రూ.2 కోట్ల మేర ఆస్తి నష్టం వాటిల్లిందని తెలుస్తోంది.

అయితే వెంటనే స్పందించిన అధికారులు మంటలను ఆర్పడంతో పెనుప్రమాదం తప్పింది. స్టీల్ ప్లాంట్ చుట్టుపక్కల స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు. 

PREV
click me!

Recommended Stories

Vijaysai Reddy Sensational Comments On YS Jagan | Asianet News Telugu
Annadata Sukhibhava: రైతుల‌కు ద‌స‌రా కానుక‌.. ఖాతాల్లోకి రూ. 6000 జ‌మ‌, ఎప్పుడంటే.?