గత అర్థరాత్రి విజయవాడలోని అక్కినేని ఉమెన్స్ హాస్పిటల్లో మంటలు చెలరేగాయి.
విజయవాడ : ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. నగరంలోని అక్కినేని మహిళా హాస్పిటల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో సిబ్బంది, రోగులు, వారి సహాయకులు భయాందోళనకు గురయ్యారు. అయితే ఈ మంటలు ఎలాంటి ప్రాణనష్టం సృష్టించకముందే అదుపులోకి తేవడంతో పెను ప్రమాదం తప్పింది.
అక్కినేని హాస్పిటల్ పైఅంతస్తులో మంటలు ప్రారంభమై కిందకు వ్యాపించాయి.వెంటనే హాస్పిటల్ సిబ్బంది అప్రమత్తమై రోగులకు ఎలాంటి హాని జరక్కుంగా జాగ్రత్త పడ్డారు. ఫైర్ సిబ్బందికి సమాచారం అందించడంతో వెంటనే అక్కడికి చేరుకున్న రెండు ఫైరింజన్లు మంటలను అదుపుచేసాయి. ఈ అగ్ని ప్రమాదంలో స్వల్పంగా ఆస్తినష్టం జరగ్గా ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.
వీడియో
షాట్ సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగి వుంటాయని అనుమానిస్తున్నారు. అగ్నిప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే స్థానిక పోలీసులు అక్కినేని హాస్పిటల్ వద్దకు చేరుకుని సహాయక చర్యల్లో పాల్గోన్నారు.