రంభ థియేటర్‌లో అగ్ని ప్రమాదం: భయంతో ప్రేక్షకుల పరుగులు

Published : Aug 31, 2018, 04:49 PM ISTUpdated : Sep 09, 2018, 01:46 PM IST
రంభ థియేటర్‌లో అగ్ని ప్రమాదం: భయంతో ప్రేక్షకుల పరుగులు

సారాంశం

రాజమండ్రిలోని  రంభ, ఊర్వశి, మేనక థియేటర్లున్న కాంప్లెక్స్ లో శుక్రవారం మధ్యాహ్నం అగ్నిప్రమాదం సంభవించింది. ఆ సమయంలో  సినిమాలు చూస్తున్న ప్రేక్షకులు అగ్ని ప్రమాదం విషయం తెలుసుకొని  థియేటర్ల నుండి  బయటకు పరుగులు తీశారు. అగ్ని మాపక యంత్రాలు  మంటలను ఆర్పాయి.

రాజమండ్రి: రాజమండ్రిలోని  రంభ, ఊర్వశి, మేనక థియేటర్లున్న కాంప్లెక్స్ లో శుక్రవారం మధ్యాహ్నం అగ్నిప్రమాదం సంభవించింది. ఆ సమయంలో  సినిమాలు చూస్తున్న ప్రేక్షకులు అగ్ని ప్రమాదం విషయం తెలుసుకొని  థియేటర్ల నుండి  బయటకు పరుగులు తీశారు. అగ్ని మాపక యంత్రాలు  మంటలను ఆర్పాయి.

రాజమండ్రిలో రంభ, ఊర్వశి, మేనక  థియేటర్లు ఒకే కాంప్లెక్స్‌లో ఉంటాయి. ఈ కాంప్లెక్స్‌లోనే ఫన్ జోన్ ఉంటుంది.ఫన్ జోన్ లో  పిల్లలతో కలిసి కుటుంబసభ్యులు సరదాగా గడిపేందుకు సాయంత్రం పూట వస్తుంటారు.

ఇక్కడ  త్రీడీ సినిమాలను ప్రదర్శిస్తారు.  అయితే మధ్యాహ్నం భోజన విరామ సమయం కావడంతో ఫన్ జోన్ ‌లో ఎవరూ కూడ లేరు. ఫన్‌జోన్‌లో షార్ట్‌ సర్క్యూట్ కారణంగా మంటలు చేలరేగాయి. 

ఈ మంటల కారణంగా ఫన్ జోన్‌లో ప్లాస్టిక్ వస్తువులన్నీ కాలిపోయాయి.  దీంతో మంటలు పెద్ద ఎత్తున వ్యాపించి పొగలు దట్టంగా వ్యాపించింది.  ఈ సమయంలోనే సినిమా చూస్తున్న ప్రేక్షకులకు అగ్ని ప్రమాదం విషయం తెలిసిన భయంతో బయటకు పరుగులు తీశారు.

దీంతో మ్యాట్నీ షో ను రద్దు చేసి  టిక్కెట్టు డబ్బులను తిరిగి చెల్లించనున్నట్టు థియేటర్ల యాజమాన్యం ప్రకటించింది.   అగ్ని ప్రమాదం  విషయం తెలిసిన వెంటనే ఫైరింజన్ కు సమాచారమిచ్చి  మంటలను ఆర్పుతున్నారు.

PREV
click me!

Recommended Stories

Hello Lokesh Interaction: హలో లోకేష్ కార్యక్రమంలోవిద్యార్థులతో లోకేష్ పంచ్ లు | Asianet News Telugu
Minister Nara Lokesh: మంత్రి లోకేష్ నే ర్యాగింగ్ చేసిన విద్యార్థి అందరూ షాక్| Asianet Telugu