స్వాధీనం చేసుకున్న మద్యం మాయం... ఎస్సై పై కేసు నమోదు

By Arun Kumar PFirst Published Sep 18, 2020, 1:14 PM IST
Highlights

జంగారెడ్డిగూడెం టౌన్ ఎస్సై గంగాధర్ పై ఇలా కేసును నమోదు చేసినట్లు ఎస్ఈబీ ఏఎస్పీ కరీముల్లా వెల్లడించారు. 

జంగారెడ్డిగూడెం: పోలీసుల తనిఖీల్లో భాగంగా పట్టుబడిన మద్యాన్ని మాయం చేశాడంటూ ఏకంగా ఓ ఎస్సైపైనే కేసు నమోదయిన విచిత్ర సంఘటన పశ్చిమ గోదావరి జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోకి జంగారెడ్డిగూడెం టౌన్ ఎస్సై గంగాధర్ పై ఇలా కేసును నమోదు చేసినట్లు ఎస్ఈబీ ఏఎస్పీ కరీముల్లా వెల్లడించారు. 

ఈ వ్యవహారం గురించి ఎస్ఈబీ ఏఎస్పీ కరీముల్లా తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పోలీస్ స్టేషన్లలో నమోదు చేసిన కేసుల్లో ఎన్‌డీపీఎల్‌ లిక్కర్‌ వివరాలను అందించాలని ఆదేశించగా పశ్ఛిమ గోదావరి జిల్లాలోని జంగారెడ్డిగూడెం ఇన్‌చార్జి ఎస్‌హెచ్‌వో రామకృష్ణ సీజ్‌ చేసిన మద్యం సీసాల్లో అవకతవకలు ఉన్నట్లు గుర్తించామన్నారు. దీంతో ఎస్ఈబీ అధికారులతో విచారణ జరిపించగా అసలు నిజం బయటపడిందని అన్నారు. 

read more  మొగల్రాజపురం దోపిడీ కేసు : మూడు రోజుల్లోనే చేధించిన పోలీసులు.. నిందితుల అరెస్ట్

ఈ ఏడాది మార్చి నుండి సెప్టెంబర్ వరకు జంగారెడ్డిగూడెంలో పట్టుబడిన మద్యం బాటిల్స్ లో  24 బాటిల్స్ మాయం అయ్యాయి. స్వాదీన చేసుకున్న మద్య బాటిల్స్ స్థానంలో వేరే బాటిల్స్ వుంచినట్లు అధికారులు గుర్తించారు. అంతేకాకుండా కేసులకు సంబంధం లేని మరో 51 బాటిల్స్ ను కూడా గుర్తించారు అధికారులు. వీటన్నింటికి బాధ్యుడిని చేస్తూ స్థానిక ఎస్సై గంగాధర్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు షరీఫ్ వెల్లడించారు. 
 

click me!