ఇసుక మాఫియా దాడి : మొత్తానికి జర్నలిస్టు బతికాడు

First Published May 5, 2017, 7:38 AM IST
Highlights

ఇసుక మాఫియా పై ఐ న్యూస్ లో  వచ్చిన  వార్తా కథనాన్ని సహించలేని  మాఫియా  అర్థరాత్రి ఆయన ఇంటికి వెళ్లి కత్తులతో దాడి చేసి  భీభీత్సం సృష్టించారు. బుధవారం రాత్రి  జరిగిన ఈ దాడిలో ఆయన  తీవ్రంగా గాయపడ్డారు. సుమారు నాలుగు గంటల కష్టపడితే గాని స్టిచెస్ వేయ లేకపోయారు డాక్టర్లు. కాలికి సిమెంట్ కట్టు. చాలా తీవ్రంగా ఉన్న బ్లడ్ బ్లీడింగ్ ని కంట్రోల్ చేయడం ద్వారా గాయానికి కుట్లు వేసి  తణుకు ఏరియా హస్పిటల్ డాక్టర్ లు ఆయన్ని బ్రతికించగలిగారు.

పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట పట్టణంలో  ఐ న్యూస్ రిపోర్టర్ రామారెడ్డి పై మారణాయుధాలతో జరిగిన దాడి జరిగింది. ఇసుక మాఫియా పై ఐ న్యూస్ లో  వచ్చిన  వార్తా కథనాన్ని సహించలేని ఇసుక మాఫియా గుండాలు అర్థరాత్రి ఆయన ఇంటికి వెళ్లి కత్తులతో దాడి చేసి  భీభీత్సం సృష్టించారు. బుధవారం రాత్రి  జరిగిన ఈ దాడిలో ఆయన  తీవ్రంగా గాయపడ్డారు. సుమారు నాలుగు గంటల కష్టపడితే గాని స్టిచెస్ వేయడం అవలేదు, కాలికి సిమెంట్ కట్టు. చాలా తీవ్రంగా ఉన్న బ్లడ్ బ్లీడింగ్ ని కంట్రోల్ చేయడం ద్వారా రామారెడ్డి గాయానికి కుట్లు వేసి  తణుకు ఏరియా హస్పటల్ డాక్టర్ లు బ్రతికించ గలిగారు.

 

ఆంధ్రప్రదేశ్ ఇసుక ను ఉచితం చేశారు. దీనితో పలుకుబడి ఉన్నవాళ్లు ఇసును ఉచితం తవ్వుకుని  అధిక ధరలకు అమ్ముకుని కోట్లు సంపాదిస్తున్నారు. నియమాలను ఉల్లంఘించి ఇసును తరలించడం, విచక్షణా రహితంగా తవ్వడం జరగుతూ ఉంది.  దీనికి వ్యతిరేకంగానే చిత్తూరు జిల్లా ఏర్పేడు రైతులు రోడ్డెక్కింది. వాళ్లమీద  ఒక లారీ దూసుకుపోయి 22 మంది చంపి వూరిని విషాదమయం చేసింది. అక్కడ నది నుంచి ఇసును తరలిస్తున్నందున తమ వూర్లో భూగర్భ జలాలు ఎండిపోతున్నాయన్నదే ఈ రైతుల గోడు. ఆగోడు నెలలతరబడి  సాగినా  పార్టీనేతుల గాని, ప్రభుత్వంలో ఉన్నోళ్లు గాని ఎవరూ  పెట్టించుకోలేదు.అందుకే రోడ్డెక్కి ధర్న చేశారు.లారికింద నలిగిపోయారు. ఆవూర్లో ప్రతికుటుంబం ఇంటి పెద్దను కోల్పోయింది. ఇసుకకాంట్రాక్టర్ల మీద కొన్ని కేసులు పెట్టారు. ఎమ్మార్వోను సస్పెండ్ చేశారు. తర్వాత ఈ కేసులు ఎలాగు  ఎగిరిపోతాయి. మరి ఈ కుటుంబాల పరిస్థితి ఏమిటి?

 

ఇలాంటిదే  జర్నలిస్టు రామారెడ్డి పై జరిగిన దాడి. ఆయన  మీద జరిగిన దాడి చూస్తే, హత్యప్రయత్నమే అనిపిస్తుంది.

 

ఇసుక మాఫియా మీద రెండు రోజుల కిందట రాసిన కథనం వలన ఈ సంఘటన జరిగింది.

 

click me!