
కోనసీమ కుంతిదేవి తీర్ధంలో ఘర్షణ జరిగింది. రామచంద్రాపురం మండలం వెల్ద గ్రామంలో గారడి ఆటగాళ్ల మధ్య వివాదం మొదలై గొడవకు దారి తీసింది. రెండు వర్గాలు కర్రలతో దాడి చేసుకున్నాయి. రంగంలోకి దిగిన పోలీసులు పరిస్ధితిని అదుపులోకి తీసుకొచ్చారు. వ్యక్తిగత కక్షలతోనే ఈ ఘర్షణ జరిగినట్లుగా తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.